— డిప్యుటీ డి ఎం హెచ్ ఓ వేణుగోపాల్ రెడ్డి
Venugopal Reddy: ప్రజా దీవెన, శాలిగౌరారం: గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసు కొని ఆరోగ్యంగా ఎదుగాలని డి ప్యూటీ DMHO కె.వేణుగోపాల్ రెడ్డి (Venugopal Reddy)అన్నారు.శాలిగౌరారం ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు అందజేసే పౌష్టికాహారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గర్భిణీలు (pregnant women) ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ పౌష్టికాహారం తీసుకున్నపుడే పుట్ట బోయే బిడ్డ ఆరోగ్య వంతంగా పుడ తారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి లోనే కాన్పు కావాలని అన్నారు. లయన్స్ క్లబ్ వారు సేవా కార్యక్ర మాలు చేయడం అభినందయ మన్నారు.
ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుందున ప్రతి ఒక్కరు పరిసరాల,వ్యక్తిగత పరి శుభ్రత పాటిస్తూ ఆరోగ్యాంగా ఉం డాలన్నారు. ఈ కార్యక్రమం లో మండల వైద్యాధికారి సూర్య శిల్ప,పిహెచ్ఎన్ రాములమ్మ, సూపర్ వైజర్ (Supervisor)మరియా,చార్టర్ ప్రసిడెంట్ బి.శ్రీనివాసులు, క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనా రాయణ, పౌష్టికాహర దాత చామల మహేందర్ రెడ్డి, అరు ణ,క్లబ్ సభ్యులు దునక వెంక న్న,గుండ్ల రామ్మూర్తి, మురారిశెట్టి కరుణాకర్,వావిలాల రామలిం గయ్య శర్మ, మద్ది వెంకటరెడ్డి, గండూరి విజయ లక్ష్మి, ఎఎన్ఎం లు,ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య సిబ్బంది (Health personnel)అప్రమత్తంగా ఉండాలి ….ప్రస్తుతం సీజనల్ వ్యాధుల వ్యాపిస్తున్న తరుణం లో డాక్టర్లు ఆరోగ్య సిబ్బంది అందుబా టులో ఉండాలని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ వేణుగోపాల్ రెడ్డి అన్నా రు. ఆయన శాలిగౌరారం ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాన్ని, కస్తూరి బాయి గురుకుల బాలికల పాఠ శాల ను ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో ( Primary Health Centre) రికా ర్డులను పరిశీలించారు. టార్గెట్లను సకాలంలో పూర్తి చేయాలన్నా రు.కేజివిబిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.