Vepakaya Batukamma: ప్రజా దీవెన, కోదాడ: పూలను పూజించే సంస్కృతి సంప్రదాయాలు (Cultural traditions)తెలంగాణ రాష్ట్ర ప్రజలదే అని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్, కమీషనర్ రమాదేవి అన్నారు కోదాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (Govt Boys High School) ఆవరణలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ప్రాంగణంలో ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ (Vepakaya Batukamma)వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమే బతుకమ్మ వేడుకలని (Vepakaya Batukamma) వారన్నారు దేశంలో ఎక్కడలేని విధంగా పూలను పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్ర ప్రజలదని తెలిపారు కోదాడ పట్టణంలోని మహిళలు పెద్ద ఎత్తున ప్రతిరోజు బతుకమ్మలను తీసుకొని వచ్చి బతుకమ్మ ప్రాంగణంలో ఆటపాటలతో బతుకమ్మలు పూజించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ మహిళలు చిన్నారులు వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.