Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sitaram Yechury: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

Sitaram Yechury: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ :ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ సిపిఎం (CPM) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) తుది శ్వాస విడిచారు. ఆగస్టు 19న అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌ (Aims Hospital)లో చేరిన సీతారాం ఏచూరి. ఈయన స్వస్థలం కాకినాడ (Kakinada) కాగా పూర్తిపేరు ఏచూరి సీతారామారావు. 1952 ఆగస్టు 12న చెన్నై (Chennai) లో జన్మించిన సీతారాం ఏచూరి, 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకొన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ మోహన్‌ కందాకు ఏచూరి మేనల్లు డు కావడం విశేషం. ఇంద్రాణి మజుందార్‌తో సీతారాం ఏచూరికి వివాహం చేసుకున్నారు. ఏచూరికి కూతురు అఖిలా ఏచూరి, కొడుకు ఆశిష్ ఏచూరి. జర్నలిస్ట్ సీమా చిస్తీని రెండవ వివాహం చేసుకున్న ఏచూరి. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌ తో చనిపోయిన కొడుకు ఆశిష్.