— విఆర్‌వో, విఎవోలకు మరో అవ కాశం
–రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో రెవె న్యూశాఖ మంత్రి పొంగులేటి భేటీ
Minister Ponguleti : ప్రజా దీవెన, హైదరాబాద్: గ్రామా ల్లో రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అ ధికారి ( జీపీవో) ను నియమిస్తు న్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసిం గ్, సమాచార పౌరసంబంధాల శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం గతంలో విఆర్‌వో ,విఎవో గా పనిచేసినవా రికి జీపీవోలుగా అవకాశం కల్పించ డానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో 3,454 మంది అర్హత సాధించారని తెలిపారు. రెవె న్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మే రకు విఆర్‌వో, విఎవో లకు మరో అ వకాశం కల్పించి ఇందుకు సంబం ధించి అర్హత పరీక్ష త్వరలో నిర్వ హించాలని నిర్ణయించినట్లు వెల్ల డించారు.
సోమవారం డాక్టర్ బి ఆర్ అంబేద్క ర్ సచివాలయంలో రెవెన్యూ కార్య దర్శి డి ఎస్ లోకేష్ కుమార్‌తో కలి సి రెవెన్యూ సంఘాలతో సమావేశ మై ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవె న్యూ అధికారిని నియమించడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్ధను చి న్నాభిన్నం చేసిందని విఆర్‌వో విఎ వో వ్యవస్ధను రద్దు చేసి సామాన్యు లకు రెవెన్యూ సేవలను దూరం చే సిందన్నారు.
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కా రం లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, అదే విధంగా సామాన్య ప్రజలకు రెవె న్యూ సేవలను చేరువ చేయడానికి ప్రజా కోణంలో నిర్ణయాలు తీసుకొ ని గ్రామ పాలనా అధికారుల ఏర్పా టుకు శ్రీకారం చుట్టామన్నారు. మీ అందరి సహకారంతో రెవెన్యూ స ద స్సులు విజయవంతమయ్యాయని సంతృప్తి వ్యక్తం చేశారు. భూ భార తి ఫలితాలు ప్రతి పేదవాడికి చేరే లా చట్టం అమలుకు క్షేత్రస్ధాయిలో పనిచేయాలని కోరారు. పదవులు శాశ్వతం కాదని పదవిలో ఉన్నప్పు డు తీసుకున్న సంస్కరణలు విధాన పరమైన నిర్ణయాలు పదిమందికి మేలు జరిగేలా ఉండాలన్నారు.
సమావేశంలో తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు వి. లచ్చిరెడ్డి, కె. రామకృష్ణ, తెలంగాణ తహశీల్దా ర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రాములు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. రామ్‌రె డ్డి,వి. భిక్షం, తెలంగాణ ఎంప్లా యిస్ సర్వీసెస్ అసోసియేషన్ అ ధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు వి. రవీందర్ రెడ్డి, కె. గౌతమ్, తెలంగా ణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేష న్ సిసిఎల్ఎ యూనిట్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఆర్. రాంబా బు, క్రిష్ణచైతన్య, తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ అ ధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జి. ఉ పేందర్ రావు లక్ష్మీ నరసింహ తది తరులు పాల్గొన్నారు.