ప్రజాదీవెన, నల్గొండ : కాలికట్ విశ్వవిద్యాలయం కేరళ వేదికగా పురుషులకు, పెరియార్ విశ్వవిద్యాలయం తమిళనాడు వేదికగా మహిళలకు నిర్వహించనున్న సౌత్ జోన్ అంతర విశ్వవిద్యాలయ వాలీబాల్ పోటీలకు ఎంజియూ జట్టు ఎంపిక చేశారు.
ఎంజియుకు ప్రాతినిధ్యం వహించే జట్టు వివరాలను యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డా హరీష్ కుమార్ ప్రకటించారు. ఎంపికలు కోఆర్డినేటర్ డా శ్యాంసుందర్, జాయింట్ సెక్రెటరీ డా మురళి, సెలక్షన్ కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, వీరారెడ్డి, మేక వాణి , శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.