Volunteers Women : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) మరియు రాష్ట్ర విపత్తు ప్రతి స్పందన దళం (SDRF) ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా గ్రామీణ సంస్థ లో రెండో విడత శిక్షణ శుక్రవారం ముగిసింది. 12 రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, జిల్లా ఫైర్, అటవీ, వైద్య రెవిన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, మృత్య శాఖ, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు శిక్షణ ఇవ్వడం జరి గిందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, ఆపదమిత్ర నోడల్ అధికారి వై. శేఖర్ రెడ్డి తెలిపారు.
ఈ శిక్షణలో మంటలు, వరదలు, భూకం పాలు మొదలు విపత్తులు నిర్వహణ, ప్రతిస్పందన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాణాపాయస్థితి లో ఉన్న వారికి రక్షించడం, ప్రథమ చికిత్స చేయడం వివిధ శాఖల తో సమన్వయం చేసుకోవడం మొదలు అంశాలపై అవగాహన క ల్పించడం జరిగిందని తెలిపారు.
ఈ శిక్షణ లో భాగంగా రెండు రోజులు రెండు గ్రూపులలో (నాలుగు గ్రామాలు) గ్రామాల లో క్షేత్ర స్థాయి సందర్శన చేయించడం మరియు పానగలు ఉదయ సముద్రంలో పైర్ మత్స్య శాఖ ఆధ్వర్యంలో చెరు వుల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, ప్రాక్టికల్ గా శిక్షణ ఇవ్వడం, వా లంటీర్లకు సర్టిఫికేట్స్ మరియు ఐడి కార్డులు డిఆర్డి ఓ చేతుల మీదు గా అందజేయడం జరిగింది.
శిక్షణతో పాటు ఆపద మిత్ర వాలంటీర్లు అందరికీ ప్రతిరోజు హార్ట్పుల్ నెస్ మెడిటేషన్ పై, శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగిందని, 3వ బ్యాచ్ సోమవారం నుండి ప్రారంభం అవుతుందన్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో హెచ్ఎర్డిఐటి డాక్టర్ ఎంసీఆర్, ప్రాంతీయ శిక్షణ మేనేజర్ పి.వెంకటేశ్వర్లు, డిఆర్డిఏ డిపి ఎం మోహన్ రెడ్డి, ఈజీఎంఎం ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నా రు.