Vote for note case: ఓటుకు నోటు కేసు వాయిదా
రాజకీయాల్లో అప్పట్లో సంచలనం ఓటుకు నోటు కేసు మరో మారు తెర మీదకు వ చ్చింది. పెను సంచలనం సృష్టిం చిన ఓటుకు నోటు కేసు సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడిం ది.
జూలై చివరి వారంలో నిర్వ హిస్తామన్న సుప్రీం ధర్మాసనం
ప్రజా దీవెన, ఢిల్లీ: రాజకీయాల్లో అప్పట్లో సంచలనం ఓటుకు నోటు కేసు(Vote for note case) మరో మారు తెర మీదకు వ చ్చింది. పెను సంచలనం సృష్టిం చిన ఓటుకు నోటు కేసు సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడిం ది. తదుపరి విచారణను రెండు వారాల తరువాత జూలై చివరి వారంలో నిర్వహిస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూ డిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది.
ఈ కేసు విచారణ తెలంగాణలో కాకుండా మధ్య ప్రదే శ్‌లో జరిగేలా బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31వ తేదీన బీఆర్ ఎస్ నేతలు గుంత కండ్ల జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహ్మద్ అలీ, కల్వకుంట్ల సంజయ్‌లు ట్రాన్స్ ఫర్ పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా ప్రతివాదు లుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme court) నోటీసులు జారీ చేసింది.
నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆ సమయంలో ఆదేశించింది. కాగా విచారణ సంద ర్భంగా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా మధ్యప్రదేశ్ కు మాత్రమే ఎందుకు మార్చాలని పిటిషనర్ల తరుఫు న్యా యవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతం అక్కడ రేవం త్(Revanth reddy) ముఖ్యమంత్రిగా ఉన్నారని, కేసు ప్రభావి తం అయ్యే అవకాశాలున్నా యని న్యాయవాదులు వివరణ ఇ చ్చారు. కాగా, రేవంత్ రెడ్డి, తెలం గాణ ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయక పోవడంతో కేసు విచారణ వాయిదా పడింది.
Vote for note case adjournment