Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Parliament Elections: నల్లగొండలో రఘువీర్ రెడ్డి మెజార్టీ రికార్డులు సృష్టించాలి

నల్లగొండ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థి రఘువీరా రెడ్డికి అత్యధిక మెజార్టీని సాధించి పెట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు నిచ్చా రు.

సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ల క న్నా మన మెజార్టీ ఎక్కువ ఉండాలి
బీజేపీ, బిఆర్ఎస్ లకు ఓటు వేస్తే మూసి నదిలో వేసినట్లే
నల్లగొండ నియోజకవర్గం ఎంపీ ఎన్నికల రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ లోక్ సభ(Lok sabha elections) నియోజకవర్గ పరిధిలో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థి రఘువీరా రెడ్డికి(Raghuveer Reddy) అత్యధిక మెజార్టీని సాధించి పెట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి(komati reddy venkat reddy)పిలుపు నిచ్చా రు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో నల్లగొండలో బుధవారం ఎంఎ న్ఆర్ గార్డెన్స్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి మీటింగ్ లో పాల్గొని నాయకులకు, కార్యకర్త లకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని ఢిల్లీ స్థాయిలో నిలబెట్టిన నల్లగొండ ప్రజలకు జన్మంతా సేవ చేసుకుం టూ ఉంటానని చెప్పారు.

లోక్ సభ ఎన్నికల పోలింగ్(Lok sabha election polling) కు ఇంకా 12 రోజు ల సమయం ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా కష్టపడి పని చేసారో పార్ల మెంట్ ఎన్నికలకు అలాగే పని చేయాలని కోరారు. ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నందున పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉదయం, సాయంత్రం మాత్రమే ప్రచారం చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే మన నల్లగొండ లో ఎంపీ అభ్యర్థి రఘువీరా రెడ్డికి ఎక్కువ మెజారిటీ రావాలని ఆకాంక్షించారు. నల్లగొండ నియోజక వర్గం లోని అర్హతలు మీ అందరికి ఇల్లు కట్టించే బాధ్యత నాది అని పేర్కొన్నారు. నల్లగొండ నడిబొడ్డున పెద్దగడియారం చౌరస్తా లో పెద్ద ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయిస్తామ ని, సుమారు రూ. 700 కోట్లతో ఔట ర్ రింగ్ రోడ్డు వేయిస్తామని, గ్రామ, మండల స్థాయిలో సమస్య ల కోసం ఒక ఉద్యోగిని పెట్టి మీ సమస్యల పరిష్కారం చేయిస్తామని వివరించారు.

వచ్చే మూడేళ్ళ లోపు సొరంగం పనులు పూర్తి చేసి అన్ని ఎకరాలకు నీరుఅందిస్తామని హామీ ఇచ్చారు. సారూ కారు సర్కా ర్ అన్న కవిత ఇప్పుడు ఢిల్లీ తీహార్ జైలులో గడుపుతోందని ఎద్దేవా చేశారు. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం అయినందున ఎంపీ అభ్యర్థికి ఇక్కడి నుంచి అత్య ధిక మెజార్టీని అప్పగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. రాజకీయంలో శాశ్వ త శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని గుర్తు చేశారు. మీరు కష్ట పడి భారీ మెజారిటీ ఇవ్వండి, స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చు నేను స్వయంగా చూసుకుంటానని స్పష్టం చేశారు. దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ యాత్రలు చేస్తున్నాడని, ప్రాంతాలవారీగా ఆయా వర్గాల ప్రజల సాధక బాధకలు బాధలు వింటున్నాడని, ఆగష్టు 15 నాటికి రూ. 2 లక్షల రుణమాఫీ చేయకుం టే నేను కూడా దేనికైనా రెడీ అని ప్రకటించారు.

అబద్ధాల అగ్గిపెట్టె హరీష్ రావు మళ్ళీ రాజీనామా అని మోసం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.మీ అందరికి చేతులు జోడించి చెప్తున్నా మీ అందరికి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత స్వయంగా నేనే తీసుకుంటానని స్పష్టం చేశారు. వచ్చే 12 రోజులు కష్టపడి పని చేసి చెయ్యి గుర్తు మీద ఓటు వేయించి మన అభ్యర్థి రఘువీరారెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో నల్లగొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెం ట్ అభ్యర్థి కుందురు రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, మాజి ఎమ్మెల్సీ పూల రవీందర్, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఎంపీపీ విజయలక్ష్మి సుమన్, జడ్పీటీసీ లువంగూరి లక్ష్మయ్య, పాశం రాంరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మాధవి, కౌన్సిలర్ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Vote wasted brs and bjp in Elections