VRA Jobs : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: జీవో నెంబర్ 81 ప్రకారం 61 సంవత్సరం ల వయసు పైబడిన వీఆర్ఏ వార సులకు ప్రభుత్వం కొత్తగా నియ మించే విలేజ్ లెవెల్ ఆఫీసర్ ని యామకాలలో ప్రాధాన్యత ఇవ్వా లని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం అన్నారు.గురువారం వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టు నిరసిస్తూ సుభాష్ విగ్రహం దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స లీం మాట్లాడుతూ అనేక సంవ త్సరాల నుండి గ్రామాల్లో పని చేసిన వీఆర్ఏలకు జీవో నంబర్ 81,85 ప్రకారం ఇంటర్ డిగ్రీ చదివిన వారిని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగాలలో నియామకాలు చేపట్టారు 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ ల స్థానంలో వారి వారసులుగా ఉన్న 3797 మందికి విలేజ్ లెవెల్ .
అధికారి ఉద్యోగానికి ప్రాధాన్యత ఇచ్చి నియామకాలు చేపట్టాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వీఆర్ఏ జేఏసీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు తాతల కాలం నుండి గ్రామాలలో సేవలు చేసి వయసు పై పడటంతో పై ఉద్యోగాలకు అవకాశం లేకుండా ఆపిన వీరందరు గత 17 నెలలుగా రెవిన్యూ వ్యవస్థలోనే పనిచేస్తూ వారి వారసులుగా ఇంటర్ డిగ్రీ చదివిన 3 797 మందికి వెంటనే ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎదురుచూస్తూ ప్రజాపాలనలో కూడా నేటికీ రాకపోవడంతో నిరాశ వ్యక్తం చేయడం జరిగింది
. వెంటనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలందరితో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు
*ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ, వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర నాయకులు కే నగేష్, ఏ రవి ,వీఆర్ఏ వారసులు వెంకన్న, అంజయ్య ,సయ్యద్, సుధాకర్, మట్టయ్య , రాజు , వెంకటమ్మ, యమునా రంజాన్ తదితరులు పాల్గొన్నారు