Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telanganagovernment : గ్రామాల్లో మళ్లీ రెవెన్యూ

–వీఆర్వో స్థానంలో జీపిఓ

–ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

— పూర్వ వీఆర్వో, వీఆర్ఎలకు అవకాశం

–నల్గొండ జిల్లాలో ఆప్షన్లు పెట్టుకున్న 341 వీఆర్వోలు, వీఆర్ఏలు

Telanganagovernment : ప్రజాదీవెన, నల్గొండ : గ్రామాల్లో రెవెన్యూ అధికారుల పాలన మళ్లీ అందుబాటులోకి రానుంది. ఆ శాఖలో గతంలో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించిన వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాము అధికారం లోకి వస్తే తిరిగి పునరుద్దరిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత ఆ దిశ గా చర్యలు చేపట్టింది. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఓ అధికారి అందుబా టులో ఉండేలా రాష్ట్ర వ్యాప్తంగా 10,954 గ్రామస్థాయి అధికారీ పోస్టులను మంజారు చేసింది.

వాటికి అనుమతినిస్తూ శనివారం ఆర్థికశాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీఆర్వో పేరును గ్రామ పాలన అధికారి(జీపీవో)గా మార్పు చేసింది. గత ప్రభుత్వం ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్వో, వీఆర్ఎలను వారి ఆప్షన్ల ద్వారా తిరిగి రెవెన్యూ శాఖకు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం జిల్లాకు 341 జిపీవోలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అయితే ఈ పోస్టులను ఉగాది నుంచి అమల్లోకి తెస్తుందా లేక మరింత సమయం పడుతుందా అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. సర్కారు నిర్ణయంపై పూర్వ వీఆర్వోలు, వీఆర్ఎ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి…రెవెన్యూ శాఖకు సంబంధించి క్షేత్రస్థాయిలో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ గతంలో ఎంతో కీలకంగా వ్యవహరించేది. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన దర ఖాస్తుల పరిశీలన, విచారణతోపాటు భూ వ్యవహారాలన్నింటిని వీ ఆర్వోలు పర్యవేక్షించేవారు. గ్రామాలకు సంబంధిం ఏ సమాచార మైనా వారి ద్వారానే ఉన్నతాధికారు లకు చేరేది. ఇక వీఆర్ఎలు గ్రామాల్లో అందుబాటు లో ఉండి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబం ధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతో పాటు గ్రామాలను సందర్శించే అధికారుల వెంటే ఉండి సహకరించేవారు.

అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ లో వీఆర్వో, వీ ఆర్ఎ వ్యవస్థను రద్దు చేస్తూ అసెంబ్లీ ద్వారా ప్రత్యేక చట్టం తీసు కువచ్చింది. రెండేళ్ల తర్వాత వీఆర్వోలుగా పనిచేస్తున్న వారందరినీ ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. మరో ఏడాది పాటు వీఆర్ఎలను కొనసాగించిన ప్రభుత్వం 2023 ఆగస్టు 3 న వారికి పేస్కేల్ అమలు చేస్తూ వారిని సైతం ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. సర్కారు నిర్ణ యంపై వీఆర్ఎ లో హర్షం వ్యక్తమైనా వీఆర్ఓ లు మాత్రం తీవ్ర అ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర శాఖల్లోకి వెళ్లినా అయిష్టంగానే పని చేస్తూ రెవెన్యూ పైనే మక్కువ కనబరిచారు.

వీఆర్వో ఇక జీపీవో….కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ అధి కారులు ఉండాలని నిర్ణయించింది. రద్దు చేసిన వీఆర్ఓ స్థా నంలో గ్రామ పాలన అధికారి (జీపీవో) నీ తీసుకురావాలని సంక ల్పించింది. గత ప్రభుత్వం ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన పూర్వ వీఆర్వోలు, వీఆర్ఎలు రెవెన్యూలో చేరేందుకు ఆసక్తి ఉంటే ఆప్షన్ ఇవ్వాలని ఇటీవల పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు నల్గొండ జిల్లాలో 540 మంది వీఆర్వోలు ఇతర శాఖల్లో సర్దుబాటు కాగా అందులో 341 మంది తిరిగి రెవెన్యూకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వీఆర్ఏ ల విషయానికి వస్తే డిగ్రీ ఉన్నవారిని మాత్రమే రెవెన్యూకు ఆప్షన్ ఇవ్వాలని కోరారు.

ఎక్కువ మంది ఇంటర్మీడియెట్ వారే ఉండటం, పే స్కేల్ కూడా ఉం డటంతో చాలామంది ప్రస్తుతమున్న శాఖల్లోనే పనిచేయాలని నిర్ణ యించుకున్నారు. అయితే ప్రభుత్వం వారి ఆప్షన్ల మేరకు నియామ కాలు చేపట్టాలని భావించడంతో విరంతా గ్రామపాలన అధికారు లుగా తిరిగి రెవెన్యూలో బాధ్యతలు నిర్వహించే అవకాశముంది. ఇలా వీఆర్వో వీఆర్ఏ లు మొత్తం 341 మంది సొంత శాకకు తిరిగి రానుండగా.. మిగతా పోస్టులను ప్రభుత్వం ఏ విధంగా భర్తీ చేస్తుం దనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

నల్లగొండ జిల్లాలో 565 రెవెన్యూ గ్రామాలు…నల్లగొండ జిల్లాలో 33 మండలాలు ఉండగా.. నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, చం డూర్ (న్యూ) నాలుగు డివిజన్లు, అదేవిధంగా నల్లగొండ, మిర్యా లగూడ రెండు అర్బన్ మండలాలు,565 రెవెన్యూ గ్రామాలు ఉన్నా యి. కాగా గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 750 మందికి పైగా విఆర్వోలు ప్రజలకు సేవలు అందించారు.

ఇందిరమ్మ ప్రభుత్వంలో వీఆర్వోలకు న్యాయం…

ఎస్ కే. జానీమియా ( పూర్వ వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షులు నల్గొండ )

గత ప్రభుత్వం రద్దు చేసిన రెవెన్యూ వ్యవస్థను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించడాన్ని స్వాగతిస్తున్నాం. ఇతర శాఖల్లో బలవంతంగా సర్దుబాటు అయిన పూర్వ వీఆర్వోలు, వీఆర్ ఏలను గ్రామ పాలన అధికారులుగా తిరిగి నియమించాలనే సర్కారు నిర్ణయం సంతోష దాయకం, రెవెన్యూలో దక్కిన గౌరవం ఇతర శాఖల్లో దక్కడం లేదు. రెండేళ్లుగా ఇబ్బందుల నడుమ విధులు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి, వీఆర్వోల సంఘం రాష్ట్ర జేఏసీ నాయకులు లచ్చిరెడ్డి, రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉపేందర్ లకు కృతజ్ఙతలు తెలిపారు.