Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vasantha Venkata Reddy : విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి వసంత వెంకటరెడ్డి

Vasantha Venkata Reddy : ప్రజా దీవెన, కోదాడ: విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని రేస్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు అన్నారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోదాడ నియోజకవర్గస్థాయి పదవ తరగతి విద్యార్థుల టాలెంట్ టెస్ట్ కు సంబంధించిన విజేతలకు నేడు కోదాడ పట్టణంలోని రేస్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ లో బహుమతులు అందజేశారు .

ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడం ద్వారా సమాజానికి ఉపయోగపడాలని ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలపై వారిని చైతన్యవంతం చేయాలని అన్నారు విద్యార్థులకు భవిష్యత్తులో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పైన ఆసక్తి కలిగేలా ఇట్టి టాలెంట్ నిర్వహించిన ఏఐఎస్ఎఫ్,
ఏ ఐ వై ఎఫ్ సంఘాల నాయకులను వారు అభినందించారు. అనంతరం నిర్వాహకులు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మనబోయిన నరేష్
మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన పదవ తరగతి విద్యార్థుల టాలెంట్ కార్యక్రమంలో 494 మంది విద్యార్థులు పాల్గొన్నారు వారిలో మొదటి బహుమతి సిహెచ్ యామిని

(శ్రీ వైష్ణవి కాన్సెప్ట్ స్కూల్)
ద్వితీయ బహుమతి రాహుల్ చౌదరి
(తేజ టాలెంట్ స్కూల్)
తృతీయ బహుమతి వి హర్షవర్దిని
(జయ హై స్కూల్) చతుర్ద బహుమతి బి సందీప్ రెడ్డి
(గ్లోబస్ ఇంటర్నేషనల్ స్కూల్)
పంచమ బహుమతి ఎం గౌతమ్ చరణ్ (సైదయ్య కాన్సెప్ట్ స్కూల్) లకు బహుమతులు అందజేసి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో బహుమతుల దాతలు పిండ్రాతి హనుమంతరావు సిరాపరపు శ్రీనివాసరావు అంబాల వెంకటి త్రివేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిరికొండ శ్రీనివాస్ పదిరె మహేష్ మండవ మధు రమేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు