–ఎంజియు ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్
Skilled Top Engineers : ప్రజా దీవెన, నల్లగొండ:: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వైజ్ఞానిక ఆవిష్కరణ ల ప్రదర్శనను ఉపకులపతి ఆ చా ర్య కాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యాలు గల ఉత్తమ మానవ వనరుల ఉత్పత్తి లక్ష్యంగా స్థాపించిన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం లక్ష్యం దిశగా పయనానికి నేటి వైజ్ఞానిక ప్రదర్శన ఒక నిదర్శనం అని అన్నారు.
విద్యార్థులు తమ అధ్యాపకుల ప్రో త్సాహంతో చేసిన ఆవిష్కరణలు వారి సున్నితత్వానికి సామాజిక స్పృహకు ధర్మం అన్నారు. సు వి శాలమైన ఎం జి యు ప్రాంగణంలో కాలుష్యం లేని వాహనం కోసం వె తుకులాడే ప్రయత్నంలో ఇంజనీ రింగ్ విద్యార్థులు మరియు అధ్యా పకులు తామే స్వయంగా రూ పొం దించగలమని ముందుకు వచ్చిన దరిమిలా విశ్వవిద్యాలయం 3.5 లక్షల ఆర్థిక సహకారంతో ఎనిమిది మంది సామర్థ్యం గల సోలార్ క్యాంపస్ కార్ట్ ను రూపొందించడం హర్షించదగ్గ విషయం అన్నారు.
నాలుగు గంటల పూర్తి రీఛార్జ్తో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవ చ్చునని, అధునాతన వాహనాల్లో ఉండే సౌకర్యాలను కల్పించడంలో విద్యార్థులు పడిన తపన స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. విశ్వవిద్యా లయం రాబోవు రోజుల్లో మరిన్ని ఆ విష్కరణలకు ప్రోత్సహిస్తుందని తెలిపారు. క్యాంపస్ కార్డుతో పా టు ఆటోమేటిక్ ఫ్లోర్ క్లీనర్, వాయి స్ కంట్రోల్ స్మార్ట్ డస్ట్ బిన్ ఫోటో గ్రాఫిక్ క్లాక్, విసిఆర్ బేస్డ్ రిఫ్రిజిరే టర్, ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టం, ఆటో మేటిక్ కూలర్ కంట్రోల్ సిస్టం, ఎ స్ప్రెస్ కాపీ మెషిన్, ఎలక్ట్రిక్ స్కూ టర్, సోలార్ గ్రాస్ కట్టర్, అంబు లెన్స్ డ్రైవర్స్ కు ఉపయోగించే సి గ్నలింగ్, ఎలక్ట్రిక్ స్కూటర్, క్వాడా ఫ్టర్ డ్రోన్, ఫేస్ రికగ్నిషన్ అటెండె న్స్ సిస్టం, ఎస్ప్రెస్ కాఫీ మెషీన్, సా ఫ్ట్వేర్ ఆధారిత ప్రాజెక్ట్ అయిన ట మాటో క్వాలిటీ అప్లికేషన్, హార్ట్ డి సీస్ ప్రేడిక్షన్, వీల్ డిఫెక్ట్ ప్రెడిక్షన్, స్కిన్ క్యాన్సర్ డిటెక్షన్ వంటి ప్రా జెక్టులను రూప కల్పన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రోత్స హించి వారిచే ఆవిష్కరణలకు కృ షిచేసిన అధ్యాపకులను ఉపకులప తి అభినందించారు. ప్రిన్సిపాల్ సిహె చ్ సుధారాణి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, డీన్ ఆచార్య రేఖ, టి మౌనిక, కే అవి నాష్, డా ఏం జయంతి, వై నాగ రాజు జి మారేశ్వరరావు, ఎం జ్యో తిరాణి, డి శ్రీనివాస్ తదితర అ ధ్యాపకులు విద్యార్థులు పాల్గొ న్నారు.