–కష్టపడి పని చేసే కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తాం
–మక్తల్ ఎమ్మెల్యే, జిల్లా పరిశీలకులు వాకటి శ్రీహరి ముదిరాజ్
–పార్టీ కోసం పనిచేసే వారికే ఛాన్స్
–ఎమ్మెల్సీ శంకర్ నాయక్
Congress Welfare Schemes : ప్రజాదీవెన, నల్గొండ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పేద ప్రజల సంక్షేమం, ప్రజల అవసరాలను గుర్తించి ముందుకెళ్తుందని మక్తల్ ఎమ్మెల్యే, జిల్లా పరిశీలకులు వాకటి శ్రీహరి ముదిరాజ్ అన్నారు. బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను అధిగమిస్తూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని పేర్కొన్నారు.
ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది సామాన్యులకు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. పార్టీ లేనిదే ప్రభుత్వం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు నిరంతరం కష్టపడి పని చేశారని పేర్కొన్నారు.
వారందరికీ సముచితస్థానం కల్పించాల్సిన బాధ్యత పార్టీ పెద్దలపై ఉందని అన్నారు.
రాబోయే ఎన్నికలలో వారికి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. కార్యకర్తల సమస్యలను కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. గత పది ఏండ్లు అధికారం లేకున్నా పార్టీ కోసం ఎంతోమంది కష్టపడి పనిచేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తమకు న్యాయం జరగడంలేదని కొంతమంది పార్టీ శ్రేణులు నిరూత్సాహంలో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడనిదే ఎవరు గెలవరని అన్నారు.
నిరంతరం పార్టీ కోసం కష్టపడిన పని చేసిన వారికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని అన్నారు. నా జీవితం ఉన్నంతవరకు పార్టీ కార్యకర్త సేవలను మర్చిపోనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అంచలంచలుగా ఎదుగుతారని పేర్కొన్నారు. సమయానం పాటిస్తే త్వరలోనే వారికి మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. ఎవరు అధైర్యపడవద్దని సూచించారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వాటన్నింటిని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. మనం చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తేనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని అన్నారు.
–పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు..
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్..
పార్టీ కోసం పనిచేసే వారికే రానున్న ఎన్నికలలో, ఇతర పదవులలో అవకాశాలు లభిస్తాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ, శంకర్ నాయక్ అన్నారు. కార్యక్రమాలు జరిగినప్పుడు ఫోటోలకు ఫోజులు ఇచ్చే నాయకులు అవసరం లేదని, వారి స్థానంలో త్వరలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని అన్నారు.
పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ పటిష్టత దేయంగా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు.
ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని పేర్కొన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి పేదలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా సన్న బియ్యం పథకం ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఇకనైనా పార్టీ శ్రేణులు పార్టీ పటిష్టత కోసం నిబద్ధతగా పనిచేయాలని కోరారు.
మరో పరిశీలకుడు నసీర్ అహ్మద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లు జూకూరి రమేష్, అంకతి సత్యం, మహిళా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, పలువురు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.