–ప్రజలకు ఏ సంస్కృతి నేర్పాల నుకుంటున్నారు
–ఎన్నికల్లో గుండుసున్నతోనైనా బిఆర్ఎస్ నేతల తీరుమారలేదు
–సీఎం స్థాయి వ్యక్తిని ఇష్టం వచ్చి నట్టు మాట్లాడడం సబబేనా
–ప్రాజెక్టుల అసంపూర్తి వల్లే ప్రస్తు తం నీళ్ల సమస్య ఏర్పడింది
–రివర్స్ పంపుడు స్టోరేజ్ టెక్నాల జీని 1978లో కాంగ్రెస్ తెచ్చిందే
–విద్యుత్ డిమాండ్ పెరిగి జిడిపి పెరుగుదలకు దోహదపడింది
–2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం
— మీడియా సమావేశంలో డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
Deputy CM Mallu Bhatti Vikramarka : ప్రజాదీవెన, నాగార్జున సాగర్: ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బిఆర్ ఎస్ నేతలు హౌలే, సన్నాసి అనడం ఏం భాష, ఏం సంస్కృతి మన భా షను ప్రజలు నేర్చుకుంటారు. అసెం బ్లీ ఎన్నికల్లో ఓడించిన, పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిన బి ఆర్ఎస్ నేతల తీరు మారలేదు. పదేళ్లు అనుభవించిన అధికారం దూరమైందని బాధతో బిఆర్ఎస్ నేతలు మాట్లాడే భాషతో సమాజం తలదించుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ ఎస్ నేతలు రాష్ట్ర ప్రజలకు ఏం నే ర్పాలి అనుకుంటున్నారని డిప్యూ టీ సీఎం ప్రశ్నించారు.నీళ్ల కోసమే అ ధికారాన్ని తెచ్చుకున్నామని తెలి పారు. శుక్రవారం నాగార్జునసాగర్ కు వచ్చిన ఆయన జెన్కో పవర్ హౌస్ లో రాష్ట్రంలోనే హైడ్రో ఎలక్ట్రి కల్ ప్రాజెక్టులపై సమక్షించారు. అ నంతరం మీడియాతో మాట్లాడారు.
పదేళ్లు పరిపాలించిన బిఆర్ఎస్ నే తలు మొద్దు నిద్రమూలంగా కృష్ణా గోదావరి జల్లాలో వాటాలు తేల్చు కోలేకపోయాం. వారి కాలంలో ప్రాజె క్టులు పూర్తి చేయకపోవడంతో ప్రస్తు తం నీళ్ల సమస్య ఏర్పడింది. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమై న బలం పార్లమెంట్లో లేకపోయినా సోనియాగాంధీ ఇతర పార్టీలను ఒ ప్పించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. ఇ ప్పుడు గొప్పగా చెబుతున్న రివర్స్ పంపుడు స్టోరేజ్ టెక్నాలజీని 19 78లో నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ పాలకులు అందుబాటులోకి తీసు కువచ్చారు. అంచనాలకు అందు కునే విధంగా రాష్ట్రంలోని అన్ని హై డల్ ప్రాజెక్టుల సందర్శనలో భాగం గా నాగార్జునసాగర్ లో హైడెల్ వి ద్యుత్ ఉత్పత్తి పై సమీక్ష జరిపాo.
17,162 మెగావాట్ల డిమాండ్ వచ్చి న రెప్పపాటు అంతరాయం లేకుం డా నాణ్యమైన విద్యుత్ సరఫరా చే సిన సిబ్బందికి అభినందనలు తెలి పారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయక త్వంలో ని ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృ ద్ధి కార్యక్రమాల మూలంగా కొత్తగా పరిశ్రమలు ఏర్పడి విద్యుత్ డిమాం డ్ పెరిగింది. ఫలితంగా జిడిపి పెరు గుదలకు దోహదపడింది. కాలుష్య రహిత, తక్కువ ధరకు అందుబా టులోకి వచ్చే గ్రీన్ పవర్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాం. 2029 – 30 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉ త్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపం చంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞా నా న్ని అందిపుచ్చుకునే రీతిలో విద్యు త్ సిబ్బందిని తర్ఫీదు చేసేందుకు ఆర్టిజెన్లు మొదలు సిఎండి వరకు శి క్షణ ఇస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శా ఖ మంత్రి ఉత్తoకుమార్ రెడ్డి బిఆర్ ఎస్ పదేళ్ల పాలనలో చేసిన నీళ్ల త ప్పులను సరిదిద్దుతున్నారు. 10 సంవత్సరాలు బిఆర్ఎస్ నేతలు ఏం తేల్చకుండా నిద్రపోయారు. వా రు నిద్రపోతే మేము నీళ్ల వాటాలు తెలుస్తున్నామని అని డిప్యూటీ సీ ఎం తెలిపారు. నీళ్లపై గట్టిగా వాదన ను వినిపించి వస్తే దారాదత్తమని బిఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నా రు. అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళకు ప్ర జలు బుద్ధి చెప్పారు.పార్లమెంటు ఎ న్నికల్లో కారు సారు 16 అంటే గుం డు సున్నా ఇచ్చారు. అయినా బిఆ ర్ఎస్ నేతల తీరు మారడం లేదని విమర్శించారు. శ్రీశైలం ఎగువ భా గాన ఎత్తిపోతల పథకం ఎవరి పాల నలో ఏర్పాటు అయ్యిందని ప్రశ్నిం చారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో ఢిల్లీకి వెళ్లాలని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పోకుండా బిఆ ర్ఎస్ నేతలు నిద్రపోయి వాళ్లు ప్రా జెక్టులు కట్టుకునే అవకాశం కల్పిం చారు. ఆ తర్వాత కెసిఆర్ ఆంధ్రప్ర దేశ్ కు వెళ్లి బేసిన్లు లేవు, బేషజా లు లేవని ప్రకటించారన్నారు. వారి కాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉం టే ప్రస్తుతం నీటి సమస్య వచ్చేది కాదని డిప్యూటీ సీఎం తెలిపారు.
10 సంవత్సరాల పాలనా కాలంలో బిఆర్ఎస్ నేతలు ఒక్క నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులను కట్టారా అని ప్రశ్నించారు. మీరు 85 00 కోట్లు ఖర్చుపెట్టి మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోతే మేము అధికారంలో కి రాగానే 100 కోట్లు ఖర్చుపెట్టి రా జీవ్ లింకు కెనాల్ ద్వారా గోదావరి నీటిని కృష్ణ కాలువలకు అనుసం ధానం చేశామని పేర్కొన్నారు. పం డిట్ నెహ్రూ మొదలుకొని ఇందిరా గాంధీ వరకు హరిత విప్లవం పేరిట దేశంలో ఆహార కొరత లేకుండా చే యడమే కాదు విదేశాలకు ఆహార పదార్థాలు ఎగుమతి చేసే స్థాయికి ఈ దేశాన్ని అభివృద్ధి పరిచారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.
అందులో భాగంగా దేశంలో అనేక బ హుళార్థక సార్థక ప్రాజెక్టులు ని ర్మించారని వివరించారు. 1978లో నాగార్జునసాగర్ లో మొదలుపెట్టిన రివర్సబుల్ పవర్ ప్రాజెక్టు గొప్ప సాంకేతిక అద్భుతమని అభినందిం చదగినది అన్నారు. ఈనాడు చర్చ లో ఉన్న పంపుడ్ స్టోరేజ్ టెక్నాలజీ ని ఆనాటి పాలకులు ఈ దేశంలో అందుబాటులోకి తెచ్చారని తెలి పారు.
నాగార్జునసాగర్ లో విద్యుత్ ఉత్ప త్తికి 8 యూనిట్లు నిర్మించగా అం దులో ఒకటి జనరల్ యూనిట్ కా గా మిగిలిన ఏడు రివర్స్ జనరేటర్లు కావడం దేశానికి అందించిన గొప్ప వరం అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ అంచనాలకు అనుగుణంగా హైడెల్ ప్రాజెక్టులు ఉత్పత్తి చేసేలా రాష్ట్రం లోని అన్ని హైడల్ ప్రాజెక్టులు సంద ర్శించే కార్యక్రమంలో భాగంగా నా గా ర్జునసాగర్ హైడల్ ప్రాజెక్టును సందర్శించినట్లు తెలిపారు. ప్రపం చంలో విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునీ కరించుకుంటూ విద్యుత్ శాఖ ముం దుకు వెళుతుందని తెలిపారు. ఏ డాది 17,162 మెగావాట్ల పీక్ డి మాండ్ వచ్చింది, గత ఏడాదిక పో లిస్తే 2000 మెగా వాట్ల అధిక డి మాండ్ అయినప్పటికీ రెప్పపాటు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిన సిబ్బందికి డిప్యూటీ సీఎం అభినందనలు తెలి పారు.
రాష్ట్ర ప్రభుత్వ అంచనాలను సవా ల్ గా తీసుకొని విద్యుత్ శాఖ సి బ్బంది పనిచేస్తున్నారని వివరించా రు.కేంద్ర విద్యుత్ సంస్థల అంచనా మేరకు 2030 నాటికి 25 వేల మె గావాట్ల విద్యుత్ అవసరం, ప్రతి సంవత్సరం 9.96 శాతం విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని తెలిపా రు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లోని యావత్ క్యాబినెట్ చేపడుతు న్న అనేక అభివృద్ధి కార్యక్రమాల బ లంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పరి శ్రమలు వస్తున్నాయి, వివిధ జిల్లా లను కలుపుతూ రీజనల్ రింగ్ రో డ్డు, ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివ ర్సిటీ వంటి కార్యక్రమాలతో విద్యు త్ డిమాండ్ గణనీయంగా పెరుగు తుందని తెలిపారు. విద్యుత్ డి మాండ్ పెరగడంతో ఉ త్పత్తి పెరిగి జిడిపి పెరగడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది ఆ ఆ దాయంతో పరిశ్రమలు స్థాపించి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతా మని తెలిపారు.
2035 నాటికి 33,773 మెగా వాట్ల విద్యుత్…. 2025 – 26 లో 18,825 మెగావాట్లు, 29-30లో 26,299 మెగలవాట్లూ 34-35 నా టికి 33,773 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్న నేప థ్యంలో గ్రీన్ పవర్ వైపు వెళ్తున్నామ ని 29- 30 నాటికి 20 వేల మెగా ప ట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా పె ట్టుకున్నామని తెలిపారు. తక్కువ ధరకు లభించడమే కాకుండా గ్రీన్ పవర్ ద్వారా కాలుష్య రహిత వి ద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
కృష్ణానదిపై జూరాల మొదలుకొని పులిచింతల వరకు, గోదావరి నది పై ఎస్ ఆర్ ఎస్ పి మొదలుకొని ఇందిరా సాగర్ వరకు ఇరిగేషన్ ప్రా జెక్టుల ద్వారా రివర్స్ పంపింగ్ తో విద్యుత్ ఉత్పత్తికి అవకాశాల ను అంచనా వేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.విద్యుత్ రంగంలో ప్ర పంచవ్యాప్తంగా వస్తున్న పరిణా మాలకు అనుగుణంగా ఆర్టిజన్ మొదలుకొని సీఎండీ వరకు దశ లవారీగా శిక్షణ ఇవ్వాలని నిర్వ హించినట్టు డిప్యూటీ సీఎం తెలి పారు.
సూర్యాస్తమం తర్వాత సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కుద రదు అందుకే పగలు సోలార్ ద్వారా ఉ త్పత్తి చేసిన విద్యుత్ ను బ్యాటరీ ల్లో నిలువచేసి అవసరమైనప్పుడు వాడుకునేలా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వైపు దృష్టి పెట్టినట్టు తెలిపారు. రా ష్ట్రంలో ప్రజా ప్రభుత్వం 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపి ణీ చేస్తుంది. 51 లక్షల కుటుంబాల కు 200 యూనిట్ల వరకు ఉచిత వి ద్యుత్తు అందిస్తుంది. ఐదు సంవత్స రాల్లో మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లో భాగంగా మొదటి సంవత్సరం నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని అ న్నారు.
అన్ని వర్గాల విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునేం దుకు 25 ఎకరాల వి స్తీర్ణంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామ ని 104 పాఠశాలలు ఒకేసారి నిర్మిం చేందుకు అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. రైతాంగ సోదరులకు తొ మ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు జమ చేసాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలలు వ్యవధిలోనే 21 వే ల కోట్లు బ్యాంకులకు జమ చేశామ ని వివరించారు.రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లుకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తూ రైతుల పక్షాన ప్రభుత్వమే విద్యుత్ శాఖకు ప్రతి సంవత్సరం 12,500 కోట్లు జమ చేస్తుందని తెలిపారు.