Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

White ration card: అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు

–గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర ప్రామాణికం
— స్థిరాస్తి పరంగా మాగాణి 3.50 ఎకరాలు,చెలక 7.5 ఎకరాలు
–పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదా యం రెండు లక్షలు
–పట్టణ ప్రాంతాల్లో భూములను కా కుండా వార్షిక ఆదాయం ఆధారం గా మంజూరు
–విధి,విధినాల రూపకల్పనలో రాజ కీయాలకతీతంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
–లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి సభ్యుల అభిప్రా యాలను పరిగణ
–వారందరికీ సమాచారం చేరేలా లేఖలు రాయాల్సి ఉంటుంది
–సక్సేనా కమిటీ సిఫారసుల పరిశీలనకు అంగీకారం
–దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో తెల్లరేషన్ కార్డుల అర్హత ప్రమా ణాలు పరిశీలన
–అంతర్ రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డు ఉండి ఇక్కడా ఉంటే ఏరివేత
–కొత్త రేషన్ కార్డుల మంజూరీ పై సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం
–ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమా ర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావే శం
–హాజరైన ఉప సంఘము సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహలు

White ration card: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుల (White ration card) మంజూరీ ఉంటుందని మంత్రివర్గ ఉప సంఘం (Cabinet Subcommittee)స్పష్టం చేసింది.అయితే అందుకు విధి విధానా లను పరిశీలిస్తున్నట్లు మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు నిర్ణయిం చారు. శనివారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన మంత్రివర్గ ఉప సంఘ ము సమావేశమై తెల్ల రేషన్ కార్డు (White ration card) మంజూరీ పై నిశితంగా చర్చించా రు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి యన్. ఉత్త మ్ కుమార్ రెడ్డి (Utta M Kumar Reddy) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపసంఘము సభ్యులు రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి దామోదరరాజ నరసింహా,రెవిన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పౌర సరఫరాల కార్యదర్శి డి.యస్ చౌహన్, ఆరోగ్య శాఖా కార్యదర్శి చిరిస్తినాజ్ చొంగతి తదితరులు పాల్గొన్నారు.

తెల్ల రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నర కు లోపు ఆదాయం,మాగాణి 3.50 ఎకరాలు,చెలక 7.5 ఎకరాలు అదే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు మించకుండా ఉండాలన్న ప్రతిపాదన ఉపసంఘము ముందుకు వచ్చిందన్నారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల (White ration card)మంజూరీలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారెవరూ ఈ అవ కాశం కోల్పోకోకుండా ఉండేలా లోతైన అధ్యయనం జరుపు తున్నామన్నారు.అందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అధికార,ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుండి కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో వారి సలహా లు,సూచ నలు తీసుకోనున్నట్లు ఉపసం ఘము చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.తక్షణమే రాజ్యసభ, లోకసభ,శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధి విధినాలలో వారి నుండి సూచనలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి డి.యస్ చౌహన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (UttaM Kumar Reddy) సూచించారు. అంతే గాకుండా డాక్టర్ ఎన్.సి.సక్షేనా కమిషనర్ గా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో పరిగణనలోకి తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండర్ (Supreme Court Special Commissioner Harsha Mander) సభ్యుడిగా ఉన్నారు.

అంతే గాకుండా రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు దిగువ పేద మధ్యతరగతి ప్రజలకు మంజూరు చేసునున్న తెల్ల రేషన్ కార్డుల మంజూరీ విషయంలో అధికారుల బృందం (A team of officers) ఇప్పటికే దేశంలోని మిగితా రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో అవలంబిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే అదే సమయంలో అంతర్ రాష్ట్రాల Interstate)నుండి తెలంగాణా కు వలస వచ్చిన వారికి అక్కడ ఇక్కడ రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్నట్లు తేలిందని అటువంటి వారికి అక్కడో… ఇక్కడో అన్న అప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపైఉప సంఘముచర్చించింది.ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు.కాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందే తడవుగా కొత్త తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వడంతో పది లక్షల దరఖాస్తులు వచ్చాయా న్నారు.