–అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే
–అక్రెడిటేషన్ నియమ నిబంధన లు మారిస్తే చూస్తూ ఊరుకోం
— మీడియా అకాడమీ చైర్మన్ సొం త జిల్లా నుంచే పోరాటo ప్రారంభి స్తాం
–నల్లగొండ జిల్లా టియూడబ్ల్యూజె సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఆస్కాని మారుతీ సాగర్
State Chief Secretary Askani Maruti Sagar : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఏడాదికాలంగా జర్నలిస్టులు అనేక రకాల సమస్య లతో సతమతమవుతున్నారని తె లంగాణ యూనియన్ ఆఫ్ వ ర్కిం గ్ జర్నలిస్ట్ h-143 రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి ఆస్కాన్ని మారుతి సా గర్ ఆందోళన వ్యక్తం చేశారు. జర్న లిస్టులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొం టున్న సమస్యల పరిష్కారం కోసం త్వరలో జంగ్ సైరన్ ప్రకటిస్తామని వెల్లడించారు. నల్లగొండ జిల్లా టి యుడబ్ల్యూజే అధ్యక్షుడు గుండ గోని జయశంకర్ అధ్యక్షతన బుధ వారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జ రిగిన టియుడబ్ల్యూజే జిల్లా కార్య నిర్వాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర కోశాధికారి యోగానంద్, తేంజు అధ్యక్ష, కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, రమణకుమార్, జాతీయ కా ర్యదర్శివర్గ సభ్యుడు అవ్వారి భా స్కర్ లతో కలిసి ప్రసంగించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య నల్లగొండ జిల్లా కేంద్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లోనే కొన సాగు తోందని, మీడియా అకాడమీ చైర్మ న్ సొంత జిల్లాలోనే ఇటువంటి పరి స్థితి నెలకొనడం బాధాకరమ న్నా రు. జర్నలిస్టులో ఇళ్ల స్థలాలతో పా టు ఇతరేతర ప్రధాన సమస్యల న్నింటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయి లో జర్నలిస్టులు ఎక్కడికక్కడ నిల దీత కార్యక్రమాలకు సిద్ధం కావాల ని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల అ క్రిడిటేషన్ కాల పరిమితి విషయం తో పాటు విధివిధానాల రూపకల్ప నలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. గడి చిన పది సంవత్సరాలలో మాజీ చైర్మన్ అల్లం నారాయణ నాయక త్వంలో కింది నుంచి పై స్థాయి వర కు విభాగాల వారీగా ప్రతి ఒక్క జర్నలిస్టు న్యాయం జరిగే విధంగా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తే అ దేదో రాష్ట్రాన్ని దివాలా తీయించే కార్యక్రమం మాదిరిగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేయడం ప్రస్తుత అ కాడమీలో ఉన్న వ్యక్తులకు సరైం దికాదని సూచించారు. ఇప్పటికైనా వ్యక్తిగత రాగాద్వేషాలను వీడి జ ర్నలిస్టు సంక్షేమమే కేంద్రంగా ప్రస్తు త అకాడమీ పెద్దలు పనిచేయాలని హితువు పలికారు. ఏది ఏమైనప్ప టికీ ఏ ఒక్క జర్నలిస్టుకు అక్రిడిటే షన్ విషయంలో ఎలాంటి జాప్యం కానీ అన్యాయం కానీ జరిగితే టి యుడబ్ల్యూజే చూస్తూ ఊరుకోద ని, సమరశీల పోరాటాలకు సన్నద్ధ మవుతామని హెచ్చరించారు.
మే 31 టిజెఎఫ్ రజతోత్సవo కు తరలిరావాలి… తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 వ సంవత్సరంలోకి అడుగుపెడుతు న్న సందర్భాన్ని పురస్కరించుకొని మే 31వ తేదీన టిజెఎఫ్ రజతోత్స వ సభ హైదరాబాద్ కేంద్రంగా నిర్వ హించ తలపెట్టినట్లు మారుతి సాగ ర్ తెలిపారు. నల్లగొండ జిల్లా జర్న లిస్టులు ప్రతి మండలం నుంచి ఒక వాహనం చొప్పున పెద్ద ఎత్తున తర లిరావడం ద్వారా టీజేఎఫ్ రజతో త్సవ సభలను జయప్రదం చేయా లని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తం గా టీయూడబ్ల్యూజే సభ్యత పరం గా గాని, కమిటీల నిర్మాణం పరం గా గాని పటిష్టవంతంగా ఉన్నందు న రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే అ ధికంగా నల్లగొండ జిల్లా నుంచి భా రీ సంఖ్యలో జర్నలిస్టు తరలివచ్చి సభను దిగ్విజయం చేయాలని కో రారు.
టియుడబ్ల్యూజే నూతన కమి టీ ప్రకటన… నల్లగొండ జిల్లా టి యూడబ్ల్యూజే జిల్లా నూతన కమి టీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆ స్కాని మారుతిసాగర్ బుధవారం ప్రకటించారు. గౌరవాధ్యక్షునిగా ఫహిమొద్దీన్, అధ్యక్షునిగా గుండ గోని జయశంకర్ గౌడ్, ఉపాధ్యక్షు లుగా జనార్దన్ రెడ్డి (సాక్షి ), శ్రీని వాస్ (డెక్కన్ క్రానికల్), ముడెo వెంకటరెడ్డి ( సివిఆర్) , బుస్సా శ్రీని వాస్ (నమస్తే తెలంగాణ), ఎ.శ్రీ ని వాస్ (ఆంధ్రజ్యోతి) గాలయ్య (సా క్షి), లక్ష్మీకాంత్ ( ఆంధ్రజ్యోతి)
ప్రధాన కార్యదర్శిగా వీరస్వామి (వార్త ), ఉప ప్రధాన కార్యదర్శి గా శివప్రసాద్ (ఆంధ్రప్రభ) కార్యద ర్శు లుగా విజయ్ (సాక్షి), రాము(టీ న్యూస్), రామ సాయిలు(సాక్షి), దండ భాస్కర్ (టీవీ 5), వేణు (సా క్షి),గురుపాదం ( మన తెలంగాణ)
మల్లేష్ (ఈనాడు), కార్యనిర్వహక కార్యదర్శులుగా అంజయ్య (జనం సాక్షి), మల్లే నాగిరెడ్డి (మనసాక్షి)
స్పోర్ట్స్, కార్యక్రమాల అమలు కా ర్యదర్శిగా భాస్కర్ (పయోనీర్) కోశాధికారిగా నారాయణ(మన తె లంగాణ) కల్చరల్ కార్యదర్శిగా న ర్సింహా రావు(ఇండిపెండెంట్) గా నియమితులయ్యారు.
అదే విధం గా, కార్యవర్గ సభ్యులుగా, నకిరేకం టి శ్రీనివాస్(నమస్తే తెలంగాణ), వి. లక్ష్మి నారాయణ (ఆంధ్రజ్యోతి)
పాష ( నమస్తే తెలంగాణ), శ్రీనివా స్ రెడ్డి(టీవీ5), కొండల్ (నమస్తే తె లంగాణ), ప్రసన్న కుమార్ (నమస్తే తెలంగాణ), రాజు(టీ న్యూస్), సై దులు (సాక్షి), సతీస్ ( ప్రజాజ్యోతి )
శంకర్ ( న్యూస్ 18 ఛానల్), మీ సాల నరహరి, ఎస్ కే రహీం ( టీవీ 100) లను ప్రకటించారు. ఇక టి యుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా నరేందర్ ( నమస్తే తె లంగాణ), సుధీర్ కుమార్ ( సా క్ష్యం), అన్నబోయిన మట్టయ్య ( అన్వేషి ), ఫణింధర్ ( వెలుగు) నియమితులయ్యారు. ఈ సమా వేశంలో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్ష, కార్యద ర్శులు వెంకటరెడ్డి, సాల్వాది జాన య్య, వీడియో జర్నలిస్ట్ అసోసి యేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లి మల్లికార్జున్, శ్రీనివాస్ గౌడ్, పోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున ముచర్ల విజయ్, ముచర్ల శ్రీనివాస్, మట్టయ్య, కొమ్ము గిరి, మారటి నర్సింహ, వెంకట మధు, హరి తదితరులు పాల్గొన్నారు.