ప్రజా దీవెన, శాలిగౌరారం: భర్త మానసిక పరిస్థితి బాగా లేక జీవితం పై విరక్తి చెందిన ఒక మహిళ ఆత్మ హత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా శాలిగౌరారం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి నూనె శేఖర్ కు గత కొంత కాలం నుంచి మానసిక పరివర్తన బాగా లేదు.ఆర్థిక ఇబ్బందులు కూడా అధికంగా ఉన్నాయి. దీంతో శేఖర్ భార్య అనూష (28) కు కుటుంబ భారం మీద పడింది.
ఈమెకు ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. దీంతో జీవితం పై విరక్తి చెందిన అనూష శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయం లో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. మృతురాలి తండ్రి కడారి కొమరయ్య పిర్యాదు మేరకు శనివారం శాలిగౌరారం హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ నజీరుద్దీన్ కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.