— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda District Collector Tripathi : ప్రజా దీవెన , నల్లగొండ: మహిళలు చిన్న చిన్న వృత్తి వ్యాపారాల ద్వా రా ఆర్థిక సాధికారత సాధించవ చ్చ ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా రు. ఇందుకు ప్రభుత్వం, బ్యాంకులు చేయూతనిస్తాయని, వాటిని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. ఆత్మస్థైర్యంతో మంచి ఆలోచన పె ట్టుబడి, నిబద్ధతతో వ్యాపారాలను ఏర్పాటు చేసి సమాజంలో పెద్ద వ్యాపారవేత్తలుగా రాణించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ఆమె చిన్న చిన్న వ్యా పారాలను ప్రారంభించి ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్న ఫాషన్ రం గంలో రాణిస్తున్న నాయిక ఫౌండర్ ఫల్గుణి నాయర్, అలాగే పిజ్జా తది తర వ్యాపారాలు ప్రారంభించిన వ్యాపారవేత్తలు ముందుగా చిన్నగా వ్యాపారాలు మొదలుపెట్టి ప్రస్తు తం కోట్లాది రూపాయల వ్యాపా రాలు చేస్తున్నారని, వీరందరినీ ఆదర్శంగా తీసుకొని ముందుకె ళ్లాలని సూచించారు.జిల్లా పరి శ్రమల శాఖ ఆధ్వర్యంలో మం గళ వారం సూక్ష్మ, చిన్న మధ్య తరహా వ్యాపారాల , సంస్థల ఏర్పాటుపై స్వయం సహాయక మహిళా సం ఘాల సభ్యులకు ఉద్దేశించి నల్గొం డ మున్సిపల్ కార్యాలయ సమా వేశ మందిరంలో ఏర్పాటుచేసిన ఒకరోజు అవగాహన సదస్సుకు హాజరయ్యారు.
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి కంటే ప్రైవేటు వ్యాపారాలు నిర్వహి స్తున్న వారే ఎక్కువ మందికి సహా యం అందించవచ్చని ,అంతేకాక ఎక్కువ మందికి మేలు చేయవ చ్చని చెప్పారు .ఎంఎస్ఎంఈ ద్వా రా అనేక రకాల వ్యాపారాలను ని ర్వహించే అవకాశాలు ఉన్నాయ ని, ముద్ర లోన్లు, పీఎంఈజీపి కింద వివిధ రకాల వ్యాపారాలు నిర్వ హించుకోవచ్చని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేతివృత్తు లు,చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని, వ్యాపా రాల నిర్వహణకు బ్యాంకులు పెట్టు బడిగా లోన్లు మంజూరు చేస్తాయని వాటిని సద్వినియోగం చేసుకోవా లని, అంతేకాక ప్రభుత్వం సైతం ఆర్థిక సహాయంతో పాటు ,శిక్షణ కార్యక్రమాలను ఇస్తుందని తెలిపా రు.
స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, పరి శ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటే శ్వరరావు, మున్సిప ల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ,త దితరులు పాల్గొన్నారు.