Womensday : మహిళలు అనే రంగాల్లో రాణించాలి
--నల్లగొండ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కె.వి.కృష్ణవేణి
మహిళలు అనే రంగాల్లో రాణించాలి
–నల్లగొండ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కె.వి.కృష్ణవేణి
Womensday : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: సమాజంలో మహి ళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధి కారి కె.వి.కృష్ణవేణి అన్నారు. శుక్రవారం స్థానిక టీఎన్జీవో భవన్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.
మహిళలు కష్టపడి పని చేస్తే అన్ని రంగాలలో రాణించవచ్చని, అం దుకు ప్రభుత్వం ఎన్నో విధాలుగా కృషి చేస్తుం దని అన్నారు.ప్రతి ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇల్లు విద్యాలయంగా పెంపొం దు తుందని అన్నారు. నాటి నుంచి నేటి వరకు మహిళ చేస్తున్న కృషి ఎనలేనిగాని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను, అధికారులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి చరిత, ఉద్యాన శాఖ అధి కారి శ్వేత, ఏపీ డి నారద, జి సి డి ఓ సరిత, ప్రాజెక్టుల సిడిపిఓలు, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది సూపర్వైజర్లు, అంగన్వా డీ టీచర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు