Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Wonder : వండర్ ఇప్ప‌టివ‌ర‌కు వ‌రుస‌గా 11 సార్లు టాస్ ఓడారు

Wonder : ప్రజా దీవెన, హైదరాబాద్: టాస్ ఓడిన చరిత్ర పుటల్లో మరో జట్టు చరిత్ర సృష్టించిoది. వ‌న్డేల్లో వ‌రు స‌గా అత్య‌ధిక మ్యాచ్‌ల‌లో 11 టాస్ ఓడిన జ‌ట్టు గా నెద‌ర్లాండ్స్ పేరిట ఉన్న రికా ర్డును భార‌త్ స‌మంచేసింది. ఛాం పియ‌న్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో టాస్ ఓడ‌టంతో ఈ రికార్డును న‌మోదు చేసింది. మార్చి 2011 నుంచి ఆగ‌స్టు 2013 మ‌ధ్య నెద‌ర్లాండ్స్ వ‌రుస‌గా 11 మ్యాచ్ ల్లో టాస్ ఓడింది.

భార‌త జ‌ట్టు కూ డా 2023 న‌వంబ‌ర్ 19న జ‌రిగిన‌ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 11 సార్లు టాస్ గెల‌వ‌లే క‌పోయింది. ఇదే ఏడాది డిసెంబ‌ర్ లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మూడు వ‌న్డేల్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. ఆ త‌ర్వాత 2024 ఆగ‌స్టులో శ్రీలంక‌తో ఆడిన మూడు వ‌న్డేల సిరీస్ లోనూ భార‌త్ ది అదే ప‌రిస్థితి. ఇటీవ‌ల స్వ‌దేశంలో ఇం గ్లండ్ తో జ‌రిగిన మూడు వ‌న్డే ల్లో నూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్ ఓడిపోయాడు.

ఈరోజు మ్యాచ్ లోనూ భార‌త్ టాస్ గెల‌ వ‌లేక‌పోయింది. ఇలా 2023 న‌వం బ‌ర్ 19 నుంచి ఇప్ప‌ టివ‌ర‌కు వ‌రు స‌గా 11 సార్లు టాస్ ఓడి, నెద‌ర్లాం డ్స్ రికార్డును స‌మం చేసింది. మ‌రో మ్యాచ్ లో టాస్ ఓడితే భార‌త్ పేరి ట అత్య‌ధిక‌ సార్లు టాస్ ఓడిన‌ చెత్త రికార్డు న‌మోదవుతోoది.