Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

World Older Persons Day: ఘనంగా ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం.

*వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.
:రోజురోజుకు కుటుంబ వ్యవస్థ దిగజారుతుండడం బాధాకరం.

World Older Persons Day: ప్రజా దీవెన,కోదాడ: ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ను (World Older Persons Day) ఆదివారం పట్టణంలో స్థానిక పెన్షనర్స్ భవనంలో వయోవృద్ధుల సంఘం (Senior Citizens Association) కోదాడ యూనిట్ అధ్యక్షులు గడ్డం నరసయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు రావెళ్ల సీతారామయ్య పాల్గొని మాట్లాడారు. రోజురోజుకు కుటుంబ వ్యవస్థ,విలువలుదిగజారుతుండడం చాలా బాధాకరం అన్నారు.  దేశ జనాభాలో 11 శాతం ఉన్న వయోవృద్ధుల సంక్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని తెలిపారు.

వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వహిస్తున్నాయన్నారు. తాము గత ఎన్నో ఏళ్ల నుంచి ఇతర రాష్ట్రాల మాదిరిగా వయోవృద్ధులకు ఆర్టీసీ ప్రయాణంలో (journey of RTC)రాయితీ కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదన్నారు. తమ సమస్యల పరిష్కారానికై మంత్రివర్గంలో ప్రత్యేక శాఖ ఉండాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో  వృద్ధాశ్రమాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా 15 మంది వయో వృద్ధులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు గడ్డం నరసయ్య,  జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు,విద్యాసాగర్ రావు,వేనేపల్లి శ్రీనివాసరావు,పందిరి రఘు వరప్రసాద్,పొట్ట జగన్మోహన్ రావు, భ్రమరాంబా, బిక్షం తదితరులు పాల్గొన్నారు.