World Photography Day: ప్రజా దీవెన, కోదాడ: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం (World Photography Day) సందర్భంగా సోమవారం కోదాడ మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ (Photo and Videographers Association) ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా కెమెరాను కనుగొన్న ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్ రే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ (cake) చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని ఫోటోగ్రాఫర్లు ఒకరికి ఒకరు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు సీనియర్ ఫోటోగ్రాఫర్లు (Senior Photographers)మాట్లాడుతూ ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లను కళాకారులుగా గుర్తించి ఆదుకోవాలని అన్నారు. అనంతరం ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి మరికంటి లక్ష్మణ్, గౌరవ సలహాదారులు బొమ్మల వెంకన్న, జెమిని నరేష్, కోశాధికారి వత్సవాయి ఉపేందర్, శ్రీరామ్ కలర్ ల్యాబ్ వాసు, కార్యవర్గ సభ్యులు అల్లాబక్ష, సైదా,యస్ యస్ శ్రీను, నరసింహారావు , వీరబాబు, నరేందర్ , ఉపేందర్ , శ్రవణ్, మణి, తదితరులు పాల్గొన్నారు.