–భక్తులతో కిటకిటలాడిన లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధాన
Yadadri:ప్రజా దీవెన, యాదగిరి గుట్ట : తెలంగాణలో కొలువుదీరిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి (Yadagirigutta Lakshmi Narasimhaswamy)పు ణ్యక్షేత్రానికి గిరి ప్రదక్షిణo కోలా హ లంగా జరిగింది. ప్రతినెలా గిరి ప్రద క్షిణ చేయడం ఆనవాయితీగా వ స్తోంది. గత నెలలో చేపట్టిన గిరి ప్రదక్షిణలో (Giri Pradakshina) అనూహ్యంగా రూ. 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోమ వారం జరిగిన ప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండ చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేర కొనసాగే ఈ గిరి ప్రదక్షిణ ఉదయం 6.05 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైంది.ఈ కార్య క్రమంలో కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య పాల్గొన్నారు.
గిరిప్రదక్షిణ (Giri Pradakshina)సందర్భంగా వ్రత మం డపం, సంస్కృత పాఠశాల, అన్న దాన సత్రం, గిరిప్రదక్షిణ రహదారికి ఇరువైపులా, మల్లాపురంలోని గోశాల తదితర ప్రాంతాల్లో రెండు వేల మొక్కలు నాటారు. ఇక గిరి ప్రదక్షిణకు (Giri Pradakshina)వచ్చే భక్తులకు ఎటు వంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే యాదగిరిగుట్ట లక్ష్మీనరసిం హస్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో (devotes)యాదగిరికొండ కిక్కిరిసిపోయింది. ఆషాడ మాసం అయినప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వాహనాల్లో యాదగిరికొం డకు చేరుకుని ఇష్టదైవాలను దర్శిం చుకుంటున్నారు. ఒక్క ఆదివారం నాడే సుమారు 30వేల మంది భక్తు లు అమ్మవారిని దర్శించుకునేందు కు రావడంతో ప్రత్యేక, ధర్మదర్శనం క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. వీఐపీ టికె ట్ దర్శనానికి గంట, ధర్మ దర్శనా నికి రెండు గంటల సమయం పట్టిం దని భక్తులు తెలిపారు. వివిధ శాఖ ల ద్వారా ఆలయ ఖజానాకు రూ.45,68,806 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు.