Yadagiri : ప్రజా దీవెన మిర్యాలగూడ: నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మాదరి యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం టియూ డబ్ల్యూజే (ఐజేయు) నల్గొండ జిల్లా కార్యవర్గ సమావేశం మిర్యాలగూ డ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవ నంలో జరిగింది. జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా ప్రెస్ క్లబ్ అధ్య క్షునిగా మాదరి యాదగిరిని, ప్రధా న కార్యదర్శిగా దాసిరెడ్డి శ్రీనివా సరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఏళ్ల బయ న్న, కోన్ రెడ్డి రామ్ రెడ్డి లను ఎన్ను కోవడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గా ఎన్నికైన యాదగిరి మాట్లాడుతూ జర్నలి స్టుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని, జర్నలిస్టులకు రావలసిన అక్రిడేషన్, ఇండ్ల స్థలా లు తదితర సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మం డలాల జర్నలిస్టుల సమస్యలను జిల్లా కార్యవర్గం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.
జిల్లా కార్యవర్గ సమావే శంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణా రెడ్డి, నూతనంగా ఎంపికైన జిల్లా ప్రధాన కార్యదర్శి కలిమెల నాగ య్య, టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర నాయకులు దోసపాటి సత్య నారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు దోటి శ్రీనివాస్, చిన్న పత్రికల అధ్యక్షులు పిట్టల రామకృష్ణ, రంగా శ్రీనివాస్, గిరిధర్ వివిధ మండలానికి చెందిన జర్న లిస్టులు పాల్గొన్నారు.