–ఆదివారం లక్ష్మీనరసింహాన్ని సేవించి తరించిన భక్తులు
Yadagirigutta:ప్రజా దీవెన, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో భక్తుల కోలా హలం నెలకొన్నది. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి నారసింహుడిని (Narasimha)దర్శించుకున్నారు. భక్తజనంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలలు కిక్కిరిసి పోయాయి. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉ దయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవా ర్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహస్వామి భక్తులకు (DEVOTEES) దర్శనమిచ్చా రు. స్వామివారికి తులసీ సహస్రనా మార్చన, అమ్మవారికి కుంకుమా ర్చన, ఆంజనేయస్వామికి సహస్ర నామార్చన చేపట్టి భక్తులకు స్వా మి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హెూమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ జరిపారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా శ్రీస్వామి వారి ఖజానాకు 64,43,032 ఆదా యం సమకూరింది. శ్రీ స్వామి వారికి 2800 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు.కళ్యాణ కట్ట రూ. 1,40,000,ప్రధాన బుకింగ్ రూ. 2,35,450, కైంకార్యములు రూ. 11,801, సుప్రభాతం రూ. 19,900 వ్రతాలు రూ.1,34,300,
వాహన పూజలు రూ. 22,500, దర్శనం రూ.13,50,000,
ప్రచారశాఖ రూ. 44,500, పాతగుట్ట రూ. 67,900, కొండపైకి వాహన ప్రవేశం రూ. 7,50,000,
యాదఋషి నిలయం రూ. 2,75, 094, సువర్ణ పుష్పార్చన రూ. 1,20,200, శివాలయం రూ. 12,400, పుష్కరిణీ రూ. 1450,
శాశ్వత పూజలు రూ. 25,000,
ప్రసాదవిక్రయం రూ. 27,01,100,
ఆలయ పునరుద్ధణ (Temple renovation) నిధిరూ. 10,700, లాకర్స్ రూ. 120 మొత్తంలో సమకూరింది.