–విస్త్రుత బదిలీలతో బ్యూరోక్రసి ప్రక్షాళన
–త్వరలో రెండో దశతో మరిన్ని బదిలీలకు అవకాశం
–మొత్తంగా 28 ఐపిఎస్ లా బదిలీ,
ఐదుగురికి నో పోస్టింగ్
IAS TRANSFER: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ (telangana) రాష్ట్ర వ్యాప్తంగా బ్యూరోక్రసి ప్రక్షాళన ప్రారంభమైంది. నిన్నటి వరకు ఐఏఎస్ (ias)ల పూర్తి స్థాయి బదిలీలు జరుగగా నేడు ఐపిఎస్ ల వంతైoది. మొత్తానికి మితంగా జిల్లా కలెక్టర్ లను బదిలీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల ఎస్పీ లకు స్థాన చలనం కల్పిం చిం ది. రాష్ట్రం లో సోమవారం 28 మం ది ఐపీఎస్‌లను (IPS) బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో పలువురు నాన్ కేడర్ ఎస్పీలు కూ డా ఉండగా జోగులాంబ గద్వాల జిల్లా (GADWAL) ఎస్పీగా ఉన్న రితిరాజ్ అవి నీతి నిరోధక శాఖ(ఏసీబీ) జాయిం ట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. మంచిర్యాల డీసీపీగా (DSP) ఉన్న అశోక్ కుమార్‌ను జగిత్యాల ఎస్పీగా అక్క డున్న సన్‌ప్రీత్ సింగ్‌ను ప్రభుత్వం సూర్యాపేట ఎస్పీగా నియమించా రు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఉన్న సుబ్బారాయుడితో పాటు మరో నలుగురికి ఎలాంటి పోస్టింగ్ (POSTING) ఇవ్వక పోవడం గమనార్హం. పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణాపాత్రో, పి.సాయి చైతన్యలకు తాజా బదిలీల్లో పోస్టిం గ్‌లు దక్కాయి. కొంత మంది ఎస్పీ లు, డీసీపీల పనితీరు, వారిపై వచ్చి న ఆరోపణలను తాజా బదిలీల్లో పరిగణనలోకి తీసుకున్నట్లు సమా చారం. ప్రస్తుతం ఎస్పీ ర్యాంక్ అధి కారుల్ని బదిలీ చేసిన ప్రభుత్వం రెండో దశలో డీఐజీ ఆపై స్థాయి అధికారులను బదిలీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. రెండో దశ బదిలీల్లో కీలక అధికారు ల మార్పు ఉండే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బదిలీలు, పోస్టింగ్ లు (POSTING) ఇలా ఉన్నాయి.
అశోక్ కుమార్ జగిత్యాల ఎస్పీ
సన్‌ప్రీత్ సింగ్ సూర్యాపేట ఎస్పీ
రాహుల్ హెగ్డే హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ
ఎల్.సుబ్బారాయుడు డీజీపీ నో పోస్టింగ్
టి.శ్రీనివాస రావు జోగులాంబ గద్వాల ఎస్పీ
రితిరాజ్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్
డీవీ శ్రీనివాసరావు కొమురంభీం ఆసిఫాబాద్ ఎస్పీ
కె.సురేశ్‌కుమార్ బాలానగర్ డీసీపీ
జానకీ మహబూబ్‌నగర్ ఎస్పీ
హర్షవర్ధన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ
విశ్వజిత్ కంపాటి సీఐడీ ఎస్పీ
బి.రాజేశ్ శంషాబాద్ డీసీపీ
కె.నారాయణ రెడ్డి వికారాబాద్ ఎస్పీ
ఎన్.కోటిరెడ్డి మేడ్చల్ డీసీపీ
నితికపంత్ 2వ బెటాలియన్ కమాండెంట్
పీజేపీసీ ఛటర్జీ డీజీపీ నో పోస్టింగ్
శరత్‌చంద్ర పవార్ నల్లగొండ ఎస్పీ
జి.చందన దీప్తీ సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ
షేక్ సలీమా వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ
ఎంఏ బారీ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలి
పాటిల్ సంగ్రామ్‌సింగ్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్
పి.సాయిచైతన్య యాంటీ నార్కొటిక్ బ్యూరో ఎస్పీ
సాధన రష్మీ పెరుమాల్ నార్త్‌జోన్ డీసీపీ
రోహిణి ప్రియదర్శిని 7వ బెటాలి యన్ కమాండెంట్
బి.రాంప్రకాశ్ డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలి
రాజమహేంద్ర నాయక్ వరంగల్ వెస్ట్‌జోన్ డీసీపీ
పి.సీతారాం డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలి
ఎ.భాస్కర్ మంచిర్యాల డీసీపీ