Yoga classes : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: యోగా శిక్షణనును ప్రతి ఒక్క పాఠ శాలలో ఏర్పాటు చేయాలని తెలంగాణ యోగ టీచర్స్ కోఆర్డినే షన్ కమిటీ( టి వై టి సి సి ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రవి కిషోర్అన్నా రు. ఆదివారం నల్లగొండ బిజెపి జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి యోగా టీచర్ల సర్వసభ్య సమావేశాని కి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ యోగాను ప్రతి పాఠశాలలో విద్యార్థి దశ నుంచే అలవాటు అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు Wrna తీసుకొని యోగా ట్రైనర్ లను ఏర్పాటు చేయాలని కోరారు. సందర్భంగా ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
చైర్మన్గా కోలా సైదులు ముదిరాజ్, గౌరవ అధ్యక్షుడు గా పోలిశెట్టి లక్ష్మయ్య, అధ్యక్షుడు చాడ పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆచార్య శివ, సెక్రటరీ బొడ్డుపల్లి సైదులు, దుబ్బ సైదయ్య, కేసు రావులు, ఉపాధ్యక్షులుగా వేల్పుల సుధాకర్, కొందుటి రాచయ్య, సిలివేరు సైదులు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నల్లెడ సుదర్శన్ రెడ్డి, గట్టుపల్లి సుష్మ, తూర్పునూరు సంధ్య, కోశాధికారిగా సింగు రామ్ బాబు, సహాయ కోశాధికారిగా బిసు కరుణాకర్, గోరంట్ల శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కోట్ల సైదులు, పున్న వెంకటేశ్వర్లు, తాడోజు పిచ్చయ్య, కట్ట మమత, జెట్టి శ్రీవాణి లు ఎన్నికయ్యారు అనంతరం కార్యవర్గాన్ని యోగ ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం ప్రసాద్, టి వై టి సి సి స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ నవీన్, వల్లోజు పోలా యాదయ్య, అంజి యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి లు ఘనంగా సన్మానించారు.