–ప్రపంచానికి యోగా విద్య అందిం చిన ఘనత మన దేశానిదే
–వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజకుమారి
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: శారీరక శ్రమ ప్రాధాన్యత తగ్గిన తరుణం లో ప్రతి ఒక్కరూ యోగాను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం అవుతుందని నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్.ఎన్. రాజకుమారి (ch rajakumari) పేర్కొ న్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) పురస్కరించుకొని కేంద్ర సమాచార, ప్రసార మంత్రత్వ శాఖ పరిధి లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (Central Bureau of Communication) ఆధ్యర్యంలో శుక్ర వారం నల్గొండ వైద్య కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వర్ రావు అధ్యక్షత వహించిన ఈ కార్య క్రమానికి ప్రిన్సిపాల్ డాక్టర్ సిహె చ్.ఎన్. రాజకుమారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిత్యానంద, జిల్లా యువజన అధి కారి ప్రవీణ్ సింగ్, వైద్య కళాశాల అధ్యాపక సిబ్బంది, యోగ గురువు శంకరయ్య అతిధులుగా హాజర య్యారు. ప్రిన్సిపాల్ (Principal) మాట్లాడుతూ ఆరోగ్య సమాజం తోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యం అని పేర్కొన్నా రు. పని ఒత్తిడికి గురి అవుతున్న వైద్యులకు యోగాతో (yoga) ఉపశమనం లభిస్తుంది అన్నారు. ఆహారం, పర్యా వరణం కలుషితం అవతున్న తరుణంలో యోగా సాధన చాలా ముఖ్యంగా మారింది అని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిత్యా నంద అన్నారు. యువజన అధికారి ప్రవీణ్ సింగ్ మాట్లాడుతూ ప్రపంచా నికి యోగా లాంటి అద్భుత వ్యా యామ విద్య ను ప్రపంచానికి అం దించిన ఘనత భారతదేశానికే దక్కుతుందని తెలిపారు. ఈ సంద ర్భంగా యోగా గురువు శంకరయ్య విద్యార్థులుతో యోగాసనాలు, సూ ర్య నమస్కారాలు సాధన చేయిం చారు. విద్యార్థులకు యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ‘ అనే అంశం పై వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వ హించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమం లో కళా శాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.