Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Youth Development : తీపికబురు, యువ వికాసం దర ఖాస్తు గడువు పొడిగింపు

Youth Development :ప్రజా దీవెన, హైదరాబాద్: రాజీవ్ యువ వికాస పథకం కింద దరఖా స్తు చేసుకునే తేదీని ఏప్రిల్ 14 వర కు పొడగించిన రాష్ట్ర ప్రభుత్వం.జిల్లాలోని నిరుద్యోగ ఎస్ సి, ఎస్ టి, బి సి, మైనారిటీ ,ఓ బి సి, ఈ బీసీ యువత రాజీవ్ యువ వికాస్ పథకానికి మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ ప్రజా పాలన సేవా కేంద్రాలలో మాన్యు వల్ గా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకుగా ను  ఏప్రిల్ 14 లోగా మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో మాన్యువల్ గా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
సోమవారం రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రా ష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి ఏ. శాంతి కుమారీలు రా ష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి హై దరాబాద్ నుండి అన్ని జిల్లాల కలె క్టర్లు,అధికారులతో రాజీవ్ యువ వికాసం పై వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు.

రాజీవ్ యువ వికాసం అమలలో భాగంగా నల్గొండ జిల్లాలో దరఖా స్తుల పరిస్థితిని  జిల్లా కలెక్టర్ ఉప ముఖ్యమంత్రి కి వివరిస్తూ రాజీవ్ యువ వికాసం కింద ఇప్పటి వరకు 22,356 దరఖాస్తులను ఆన్లైన్ ద్వా రా స్వీకరించడం జరిగిందని తెలి పారు.నల్గొండ ,మిర్యాలగూడ ల నుండి ఎక్కువగా దరఖాస్తులు వ చ్చాయని, జిల్లా కలెక్టర్ కార్యాల యంలో ప్రత్యేకించి రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ప్రజా పాలన సేవా కేంద్రాన్ని  ఏర్పాటు చేశామని చెప్పారు.  మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించేందుకు గా ను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదే శాల మేరకు అన్ని మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో ఖాళీ దరఖాస్తు ఫారాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

అదేవిధంగా ఇప్పటివరకు   ఆన్లై న్లో దరఖాస్తు చేసుకున్న అన్ని దర ఖాస్తుల ప్రింట్ కాపీలు తీసి సిద్ధం గా ఉంచుతామని తెలిపారు.  రాజీ వ్ యువవికాసం కింద  స్వయం  ఉపాధి పొందేందుకు ఏప్రిల్ 14 లోగా దరఖాస్తు చేసుకునే విధం గా   అన్ని గ్రామాలు, మండల, మున్సిపల్ కేంద్రాలలో విస్తృత ప్రచారం కల్పిస్తామని, అలాగే టామ్ టామ్ చేయిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.


రాజీవ్ యువ వికాసం కింద జిల్లా లోని యువత స్వయం ఉపాధి పొందేందుకు ఏప్రిల్ 14 లోగా మం డల,మున్సిపల్ ప్రజాపాలన సేవా కేంద్రాలలో మాన్యువల్ గా దరఖా స్తు చేసుకోవాలని జిల్లాలోని నిరు ద్యోగ ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓ బి సి ,ఈ బి సి యువతను కలెక్టర్ కోరారు.రాజీవ్ యువ వికాసానికి సంబంధించి సందేహాల నివృత్తికి గాను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 18004251442 ను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఆమె పేర్కొన్నా రు. ఈ పథకం అమలుకు నల్గొండ జిల్లాలో ఎస్ సి కార్పొరేషన్ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ ను నోడల్ అధికా రిగా నియమించినట్లు తెలిపారు.

అంతకుముందు రాష్ట్ర ఉపముఖ్య మంత్రి రాజీవ్ యువ వికాస పథ కంపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం సుమారు 10 వేల కోట్ల రూ పాయలను ఖర్చు చేసి నిరుద్యోగ ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనారిటీ, ఓబీ సీ ,ఈ బీసీ యువతకు స్వయం ఉ పాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకం గా రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ పథకంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అమలు చే యాలని, క్షేత్ర స్థాయి వరకు ప్రజ ల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, మండల స్థాయి అధికారులతో స మావేశం నిర్వహించి పథకం విధి విధానాలను స్పష్టంగా తెలియజే యాలని చెప్పారు. అలాగే జిల్లా మంత్రులు ,శాసనసభ్యులతో రా జీవ్ యువ వికాస పథకానికి సం బంధించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. యువత వారి కాళ్లపై వారు నిలబడి స్వయం ఉ పాధి పొందెందుకు ఇది చక్కటి అవకాశం అని, అందువల్ల ఈ పథకంలో పని చేసే ప్రతి ఒక్కరు మనసుపెట్టి పనిచేయాలని, రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖా స్తు చేసుకునే తేదీని పొడిగించాలని క్షేత్రస్థాయి నుంచి వచ్చిన అభ్య ర్థనలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకునే తేదీ ని పొడగిస్తున్నట్లు ఆయన వెల్ల డించారు.

ఈ పథకం కింద అర్హత పొందిన లబ్ధిదారులకు జూన్ 2న సాంక్షన్ ఉత్తర్వులు ఇవ్వడం జరుగు తుం దని తెలిపారు. అనంతరం దశల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వ హించడం జరుగుతుందన్నారు.
ఆన్లైన్లో దరఖాస్తుల ను స్వీకరిం చడంలో ఉన్న  ఇబ్బందులను అధి గమించేందుకు గాను అన్ని మం డల ప్రజా పాలన సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాలలోని ప్రజాపాలన సేవా కేంద్రాలలో మా న్యువల్ గా దరఖాస్తులను స్వీక రించాలని ఆదేశించారు. ఆన్లైన్ పోర్టల్ నుండి కేవలం ఖాళీ దరఖా స్తులు మాత్రమే డౌన్లోడ్ చేసుకో వాలన్నారు . ఇక పై ఎలాంటి అప్లికే షన్లను ఆన్లైన్లో అనుమతిం చవ ద్దని,  ఇదివరకు ఆన్లైన్ ద్వారా స్వీకరించిన అన్ని దరఖాస్తుల  కాపీలను ప్రింట్ తీసి ఉంచుకోవ డంతోపాటు ,డేటా ఎంట్రీ చేయాల ని చెప్పారు . ఇకపై రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తులను మండల ప్రజా పాలన సేవ కేంద్రాలలో తీసుకోవా లని, దరఖాస్తులను పూర్తిచేసి మం డల ప్రజా పాలన కేంద్రాలు, ము న్సిపల్ కార్యాలయాలలోని ప్రజా పాలన కేంద్రాలలో ఇవ్వాలని ఆ యన పునరుద్గష్టించారు.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ దశా బ్దాల కాలంగా ఎస్సీ, ఎస్టీ ,బీ సీ ,మైనార్టీ, ఓ బి సి, ఈ బీసీ యు వతకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తున్నప్పటికీ అవి సరైన విధంగా అమలు కావటం లేదని, అందుకే రాజీవ్ యువ వికాస పథ కాన్ని అమలు చేసేందుకు నిర్ణ యించడం జరిగిందని, రాజీవ్ యు వ వికాస పథకం లో నాణ్యతను ఏ విధంగా పెంపొందింప చేయాలో జి ల్లా కలెక్టర్లు ఆలోచించాలని, ఈ పథకం కింద ఏర్పాటు చేసిన యూ నిట్లు శాశ్వతంగా ఉపాధి పొందేలా ఉండాలని ,ప్రతి జిల్లాలో ఈ పథ కాన్ని ప్రత్యేకంగా ప్రత్యేకంగా పర్య వేక్షించేందుకు అధికారిని నియ మించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీధర్, తదితరులు సూచనలు, సలహాలు చేశారు.
అదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, ఇతర అధి కారులు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.