Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Youth Parliament : వికసిత్ భారత్ ప్రపంచంలో అగ్రగామి

మార్చ్ 12,13వ తేదీలలో నాగార్జున ప్రభుత్వ కళాశాల లో యూత్ పార్లమెంట్

Youth Parliament : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ 2047 వికసిత్ భారత్ భాగంలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా ప్రపంచంలో అగ్రగామి దేశంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో మన భారత దేశం ఇంకా ముందు వరసలో ఉండాలని ప్రధాన మంత్రి పిలుపు మేరకు 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ,కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు , క్రీడాశాఖ మాత్యులు వారి ఆదేశాల మేరకు యువకులను సన్నదం చేయాలని యువ పార్లమెంట్ పోటీలనును జిల్లా,రాష్ట్ర స్థాయి లో నిర్వహించి రాష్ట్ర అసెంబ్లీ లో మరియు దేశ పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం యువకులకు కల్పిస్తూ నిర్వహిస్తున్న యూత్ పార్లమెంటు ను విజయవంతం చేయాలని ప్రిన్సిపాల్ మరియు చైర్మన్ డా. సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన జిల్లా స్థాయి యూత్ పార్లమెంటరీ పోస్టర్ ను ముఖ్య అతిథిగా ఎన్ఎస్ఎస్ సెల్ కోఆర్డినేటర్ పి .మద్దిలేటి ఆధ్వర్యంలో విడుదల చేశారు.

జిల్లా నుంచి అతిథులు గా నెహ్రూ యువ కేంద్ర యూత్ ఆఫీసర్ బి.ప్రవీణ్ సింగ్, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ కొండానాయక్ పాల్గొన్నారు.మై భారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 25, 2025న ప్రారంభమై మార్చి 9, 2025న రాత్రి 11:59కి ముగుస్తుంది.యూత్ పార్లమెంట్‌లో పాల్గొనే యువత 24 ఫిబ్రవరి 2025 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నల్గొండ,యాదాద్రి మరియు నాగర్ కర్నూల్ జిల్లాలకు నోడల్ కళాశాల గా నాగార్జున కళాశాలను ఎంపిక చేసారు.ఈ మూడు జిల్లాల నుంచి మై భారత్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాట్ డస్ వికసిత్ భారత్ మీన్ టూ యూ అనే అంశంపై ఒక్క నిమిషం వీడియో తీసి పంపాలి.

జిల్లా స్థాయిలో యూత్ పార్ల మెంట్ ను నివహించే అవకాశం నాగార్జున ప్రభుత్వ కళాశాలకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని , మా కళాశాలలో 12-03-2025 నుంచి 13-03-2025 వరకు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు.రాజ్యాంగం ఆమోదం పొందిన ఏ భాషలోనైనా ఒక్క నిమిషం వీడియోను అప్లోడ్ చేసుకోవచ్చు.వీడియోలు ఆఫ్ లోడ్ చేసిన వారిలో 150మందిని మూడు జిల్లాల నుంచి ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్దులను రాష్ట్ర స్థాయికి 10మంది విద్యార్దులను పంపుతారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ కన్వీనర్ శ్రీధర్ యన్ యస్ యస్ యూనిట్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ , యమ్ వెంకట రెడ్డి ,యన్ కోటయ్య , ఏ.మల్లేశం, ,యమ్ సావిత్రి బోధన మరియు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.