–ఒరేయ్ సంజయ్ బంజేయ్ రా గంజాయి” షార్ట్ ఫిలింకు అభినం దనలు
–యువకులకు నల్లగొండ పోలీసుల కితాబు
Youth Power Against Drugs : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా లో మాదకద్రవ్యాల నిర్మూలన లో ‘యువ’ శక్తి తమవంతు ప్రయ త్నం ప్రారంభించింది. నల్లగొండ వ్యా ప్తంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ సారధ్యంలో మాదకద్రవ్యాల ని ర్మూలన కోసం పోలీసు శాఖ విస్తృ త కార్యాచరణతో కొనసాగుతోన్న క్రమంలో కొందరు యువకులు తమ వంతు ఆలోచనలకు పదునుపె డు తూ షార్ట్ ఫిలిం రూపంలో చైతన్య వంతమైన షార్ట్ ఫిలింకు రూపక ల్పన చేశారు.
గంజాయి రహిత నల్గొండ జిల్లాగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు, తల్లి దండ్రులు, యువత, మరియు ప్రజ లలో ఆశించదగ్గ చైతన్యాన్ని తీసు కువస్తున్నారoటే దాని వెనుక నల్ల గొండ జిల్లా పోలీసు శాఖ కృషి పలు వురి ప్రశంసలు అందుకుంటోంది.
నల్లగొండ పోలీసులు తమ సామా జిక బాధ్యతను కళ, అవగాహన, చట్టపరమైన చర్యలతో కలిపి తీసు కెళ్తున్న విధానం సర్వత్రా ఆదర్శంగా నిలుస్తోంది.
ఈ క్రమంలో మాదకద్రవ్యాల విని యోగం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరిస్తూ అవగాహన సృష్టించేందుకు నల్లమ ల రాగం బృందం రూపొందించిన “ఒరేయ్ సంజయ్ బంజేయ్ రా గం జాయి” అనే పాట రూపంలోని షార్ట్ ఫిలిం సర్వత్రా ప్రశంసలు అందుకుం టోంది. ఈ సృజనాత్మక ప్రయత్నా న్ని, దాని వెనుక ఉన్న కృషిని నల్ల గొండ డిఎస్పి శివరాంరెడ్డి స్వయం గా అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఇలాంటి పాటల ద్వారా యువ తలో చైతన్యం పెంచటం మాదకద్ర వ్యాల నిర్మూలనలో కీలకంగా నిలు స్తుందన్నారు. నల్లమల రాగం బృం దానికి నా శుభాకాంక్షలు అంటూ కి తాబునిచ్చారు. నల్గొండ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పు తెచ్చే శక్తి యు వత చేతిలో ఉంది. ఇటువంటి చైత న్యవంత కార్యక్రమాలలో యువత ముందుంటేనే ఒక మత్తు-రహిత భవిష్యత్తు సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాం టి కళాత్మక విన్యాసాలు మానవ విలువలను చాటడమే కాకుండా, యువతను మేల్కొలిపే శక్తిగా మా రతాయన్నారు. నల్లగొండ యువత ఈ ప్రయోగంతో సమాజానికి ఒక గొప్ప సందేశం ఇచ్చారని కొనియా డారు.
ఈ కార్యక్రమంలో షార్ట్ ఫిలిం
ప్రొడ్యూసర్ మహేష్ డైరెక్టర్ శివ రాం, లింగస్వామి బ్లైండ్ సింగర్ మాలశ్రీ , అనిత ,కొంగరి రమేష్, రా ము, కురుమయ్య ,యాదయ్య, తి రుపతయ్య ,జంగయ్య ,కోటేష్ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు రాజు, రాము, సంకటి వీరేశం,యోగి సేవా భారతి సభ్యులు శిరీష్ కుమా ర్ భీమనపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.