YouTuber Mukesh Chandra: ప్రజా దీవెన, ఖమ్మం: చత్తీస్ ఘడ్ రాష్ట్రం బస్తర్ లో జాతీయ మీడి యా ఛానల్ లో యువ జర్నలిస్టు గా,యుట్యూబర్ గా పని చేస్తున్న ముఖేష్ చంద్రను అత్యంత పాశవి కంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని టీయూ డ బ్ల్యూయుజె(టీజేఎఫ్) జిల్లా అధ్య క్ష,కార్యదర్శులు ఆకుతోట ఆది నారాయణ, చిర్రా రవిలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రకర్ హత్య ఖండను నిరసిస్తూ టీయూ డబ్ల్యూయుజె(టీజేఎఫ్) రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా ఖమ్మం నగరంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు.ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి జర్నలిస్టులు మయూరి సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.తర్వాత జడ్పి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రకర్ ను హత్య చేసిన నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు నినాదాలు చేశారు.
ఈసందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లా డుతూ రోడ్డు కాంట్రాక్ట్ పనిలో 120 కోట్ల స్కాము ను బయటపెట్టినం దుకు,జర్నలిస్టు చంద్రకర్ ను అత్యంత పాశవికంగా హత్య చేసి నిందితులు వారి ఇంటి ప్రాంగ ణంలోని సేఫ్టీక్ ట్యంక్ లో చంద్రకర్ డెడ్ బాడీని దాచి పెట్టడం బాధాక రం అన్నారు.అవినీతిని బయట పెట్టె జర్నలిస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు.జర్నలిస్టులకు వృత్తి పరంగా రక్షణ కల్పించే విధంగా కఠినమైన చట్టాలు తీసుకురావా లని ప్రభుత్వాలను ఆదినారాయణ డిమాండ్ చేశారు.నిరసన కార్యక్ర మంలో వీడియో జర్నలిస్టు అసోసి యేషన్ అధ్యక్షులు నాగరాజు, యూనియన్ జిల్లా నాయకులు మందుల ఉపేందర్,ఉదయ్ షేక్.జానీ పాషా,నగర కార్యదర్శి అమరవరపు కోటేశ్వరరావు,ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాంబాబు,కోశాధికారి బిక్కి గోపి,మీడియా ఇంచార్జ్ తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.