–సమయస్ఫూర్తితో ఐదుగురికి ప్రాణదానం
Miryalaguda Fire Accident : ప్రజా దీవెన, నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప ట్టణంలోని ఇస్లాంపుర ప్రాం తంలో చోటుచేసుకున్న అగ్నిప్రమా దం తీవ్ర కలకలం రేపింది. చెప్పుల దుకాణం ఉన్న భవనంలో ఒ క్కసారిగా మంటలు చె లరేగడంతో పైఅంతస్తుల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు ప్రాణభయం తో వణికిపోయారు. మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించ డంతో బయటకు వచ్చే మార్గం క నిపించక భవనంలో చిక్కుకున్న వారు సహాయం కోసం ఆర్తనాదా లు చేశారు.
అప్రమత్తమైన పోలీసులు..ఐదుగురికి పునర్జన్మ
అగ్నిప్రమాద సమాచారం అందు కున్న మిర్యాలగూడ వన్‌టౌ న్ పోలీసు సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంఘ టనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అంచనా వేసి వెంటనే సహాయక చర్యలు చేపట్టి, భవనంలో చిక్కుకున్న ఐదుగురు కుటుంబ స భ్యులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు కూడా చర్యలు చేపట్టా రు.
పోలీసుల సమయస్ఫూర్తికి ప్రశంసలు
ప్రమాద సమయంలో వేగంగా స్పందించి ఐదుగురి ప్రాణాలను కాపాడిన మిర్యాలగూడ వన్ టౌ న్ పోలీసుల సేవలు అభినం దనీ యం. అత్యవసర పరిస్థితుల్లో ప్ర జల రక్షణకు పోలీసులు ఎల్లప్పు డూ అప్రమత్తంగా ఉంటారనే వి షయాన్ని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. ఆపదలో అండగా నిలిచి.. ఐదుగురి ప్రాణాలను కా పాడిన పోలీసులకు అభినందనలు వెల్లువెత్తు తున్నాయి.
Fire accident in Nalgonda district Miryalaguda town https://t.co/lgBZPlTzXG
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) October 11, 2026

