–సిద్దిపేట జిల్లాలో అధికారుల చ ర్యలు
–ఆర్డీవో ప్రాథమిక నివేదిక ఆధా రంగా ఉత్తర్వులు
Gajwel Tahsildar Suspended : ప్రజా దీవెన, గజ్వేల్: భూసమ స్య పరిష్కారం కోసం వచ్చిన రై తుతో అనుచితంగా వ్యవహరిం చిన గజ్వేల్ తహసీల్దార్ చిట్టం పల్లి స్వామిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. రైతును కించపరిచేలా మాట్లాడిన ఘటన పై ఆర్డీవో సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
భూసమస్య పరిష్కారం కోసం త న వద్దకు వచ్చిన రైతుతో తహ సీల్దార్ స్వామి దురుసుగా వ్యవ హరించడమే కాకుండా,“ఇంకా చనిపోలేదా?” అంటూ అవమా నకరంగా మాట్లాడినట్లు ఆరోప ణలు వచ్చాయి. ప్రజా సమస్యల ను పరిష్కరించాల్సిన బాధ్యతా యుతమైన స్థానంలో ఉన్న అధి కారి, రైతు పట్ల ఇలాంటి వ్యాఖ్య లు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటనను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి, ఆర్డీవో ప్రా థమిక నివేదిక ఆధారంగా తహ సీల్దార్ స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుప రి ఆదేశాలు వచ్చే వరకు అను మతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని స్పష్టం చేశారు.
రైతుల సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరిం చాల్సిన అధికారులు, ప్రజల ప ట్ల గౌరవంగా మెలగాలనే అంశా న్ని ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది.
