–ఫ్లోరైడ్ మహమ్మారికి శాశ్వత పరిష్కారమే లక్ష్యం
–డిండి ఎత్తిపోతల పథకంపై రాజ్‌గోపాల్ రెడ్డి సమీక్ష
–ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు కార్యాచరణ వేగవంతం
–రూ.1,800 కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వ నిధుల మంజూరు
Mla Komatireddy Raj Gopal Reddy Review with Irrigation engineers : ప్రజా దీవెన, హైదరాబాద్: ఫ్లోరైడ్ సమస్యతో దశాబ్దా లుగా సత మ తమవుతున్న మునుగోడు నియోజకవ ర్గ ప్రజల కు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం తో పాటు, రై తుల సా గునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యం గా ముందుకు సాగు తున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజ్ గో పాల్ రె డ్డి స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం, రైతుల భవిష్యత్తు తో ముడిపడిన నీటి సమస్య పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
డిండి ఎత్తిపోతల పథకంపై కీలక సమీక్ష
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపో తల పథకంలో భాగంగా చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకంతో పా టు, మునుగోడు నియోజకవర్గం లోని లక్ష్మణాపురం, శివన్న గూడెం రిజర్వాయ ర్లకు నీటిని తర లించే అంశంపై హైదరాబాద్‌లోని తన నివా సంలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల ప్రతినిధులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వ హించారు. నీటి తరలింపు, భూ సేకర ణ, హెడ్‌వర్క్స్ నిర్మాణం త దితర అంశాలపై విస్తృతంగా చ ర్చించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుల కు నీటిని ఎక్కడి నుంచి తరలించాలనే అంశంపై స్పష్టమైన కా ర్యా చరణ లేకుండా పోయిందని పేర్కొన్న రాజ్‌గోపాల్ రెడ్డి, ప్ర జా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన చొరవతో ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ. 1,800 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు.
పనులన్నీ పూర్తయ్యేలా కృషి
ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు చేపట్టాల్సి న పనులతో పాటు, లక్ష్మణాపురం, శివన్నగూడెం ప్రాజెక్టుల పరిధిలోని హెడ్‌వర్క్స్ నిర్మాణం, భూసేక రణ, ఇతర అనుబం ధ పనులను వేగవంతం చేసేలా ప్రభుత్వంతో మాట్లాడతానని విశ్రాంత ఇంజనీర్ల ప్రతినిధులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కే బినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని పే ర్కొన్నారు.
మునుగోడుకు తాగు అందించడమే ధ్యేయం
ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు అంశంపై చర్చలు జరు గుతున్న నేపథ్యంలో, మునుగోడు ప్రజల అవసరాలే త మకు అ త్యంత ప్రాధాన్యమని రాజ్‌గోపాల్ రెడ్డి స్పష్టం చేశా రు. ఫ్లోరైడ్ సమస్య నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడం తో పాటు, వ్యవ సాయానికి అవసరమైన నీటిని అందించి రై తుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొ న్నారు.డిండి ఎత్తిపోతల పథకం, లక్ష్మణాపురం, శివన్నగూ డెం రిజర్వాయర్ల పనులు పూర్త యితే మునుగోడు ప్రాంతంలో తా గునీరు, సాగునీటి అవసరాల పరిష్కారానికి కీలక ముందడు గు పడుతుందని ఆశాభావం వ్యక్తమైంది.ఈ సమావేశంలో తె లంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్య క్షుడు మేరెడ్డి శ్యాం ప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంక టే శం, సలహా దా రులు వి. వెంకటరామారావు, ఎం. సత్తిరెడ్డి, ఇంద్ర సేనారెడ్డి, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Mla Komatireddy Raj Gopal Reddy Review with Irrigation engineers

