–ఫ్లోరైడ్ మహమ్మారికి శాశ్వత పరిష్కారమే లక్ష్యం
–డిండి ఎత్తిపోతల పథకంపై రాజ్‌గోపాల్ రెడ్డి సమీక్ష
–ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు కార్యాచరణ వేగవంతం
–రూ.1,800 కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వ నిధుల మంజూరు
Munugode Drinking and Irrigation Water : ప్రజా దీవెన, హైదరాబాద్:ఫ్లోరైడ్ సమస్యతో దశాబ్దాలుగా సత మ తమవుతున్న మునుగోడు ని యోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతో పా టు, రైతుల సాగునీటి అవసరా లను తీర్చడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నామని మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్ర జ ల ఆరోగ్యం, రైతుల భవిష్యత్తు తో ముడిపడిన నీటి సమస్య ప రిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచె ప్పారు.
డిండి ఎత్తిపోతల పథకంపై కీలక సమీక్ష
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపో తల పథకంలో భాగంగా చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకంతో పా టు, మునుగోడు నియోజకవర్గం లోని లక్ష్మణాపురం, శివన్న గూ డెం రిజర్వాయర్లకు నీటిని తర లించే అంశంపై హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలంగాణ వి శ్రాంత ఇంజనీర్ల ప్రతినిధులతో ఎ మ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వ హించారు. నీటి తరలింపు, భూ సేకరణ, హెడ్‌వర్క్స్ నిర్మాణం త దితర అంశాలపై విస్తృతంగా చ ర్చించారు.గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో ఈ ప్రాజెక్టులకు నీటిని ఎక్కడి నుంచి తరలిం చా లనే అంశంపై స్పష్టమైన కా ర్యా చరణ లేకుండా పోయిందని పే ర్కొన్న రాజ్‌గోపాల్ రెడ్డి, ప్రజా ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన చొరవతో ఏదుల రి జర్వాయర్ నుంచి నీటిని తరలిం చే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.1,800 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు.
పనులన్నీ పూర్తయ్యేలా కృషి
ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి ని తరలించేందుకు చేపట్టాల్సిన పనులతో పాటు, లక్ష్మణాపురం, శివన్నగూడెం ప్రాజెక్టుల పరిధిలో ని హెడ్‌వర్క్స్ నిర్మాణం, భూసేక రణ, ఇతర అనుబంధ పనులను వేగవంతం చేసేలా ప్రభుత్వంతో మాట్లాడతానని విశ్రాంత ఇంజనీ ర్ల ప్రతినిధులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కేబినెట్ తీసుకున్న ని ర్ణయానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగేలా అ వ సరమైన చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు.
మునుగోడుకు తాగు, సాగునీరు అందించడమే ధ్యేయం
ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు అంశంపై చర్చలు జరు గుతున్న నేపథ్యంలో, మునుగో డు ప్రజల అవసరాలే తమకు అ త్యంత ప్రాధాన్యమని రాజ్‌గోపా ల్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్లోరైడ్ స మస్య నుంచి ప్రజలకు ఉపశమ నం కల్పించడంతో పాటు, వ్యవ సాయానికి అవసరమైన నీటిని అందించి రైతుల జీవితాల్లో మా ర్పు తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.డిండి ఎత్తిపోతల పథకం, లక్ష్మణాపురం, శివన్నగూ డెం రిజర్వాయర్ల పనులు పూర్త యితే మునుగోడు ప్రాంతంలో తాగునీరు, సాగునీటి అవసరాల పరిష్కారానికి కీలక ముందడుగు పడుతుందని ఆశాభావం వ్యక్త మైంది.
ఈ సమావేశంలో తెలంగాణ వి శ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షు డు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి, ప్ర ధాన కార్యదర్శి తన్నీరు వెంకటే శం, సలహాదారులు వి. వెంక ట రామారావు, ఎం. సత్తిరెడ్డి, ఇంద్ర సేనారెడ్డి, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


