Tuesday, October 27, 2026
More
    HomeOpinionHydarabad city Loud Noises Panic : భాగ్యనగరంలో భారీ శబ్దాల కలకలం,భయంతో ఇళ్ల నుంచి...

    Hydarabad city Loud Noises Panic : భాగ్యనగరంలో భారీ శబ్దాల కలకలం,భయంతో ఇళ్ల నుంచి పరుగులు

    📰 Generate e-Paper Clip

    — రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌ సహా పలు ప్రాంతాల్లో శబ్దాలు

    Hydarabad city Loud Noises Panic : ప్రజా దీవెన, హై దరా బాద్‌: హైదరాబాద్‌ నగరంలో మంగళవారం ఉదయం ఒక్క సారిగా వినిపించి న భారీ శబ్దాలు స్థానికులను తీవ్ర భ యాందో ళనకు గురిచేశాయి. ఉదయం 9.15 గంటల సమ యంలో రా జేంద్రనగర్‌, ఉప్పరప ల్లి, అత్తాపూర్‌, ఎర్రబోడ, లం గర్‌ హౌస్‌, కేశవ స్వామినగర్‌ తదితర ప్రాంతాల్లో వరుసగా పే లుళ్లను తలపించే శబ్దాలు వినిపించడంతో ప్రజలు ఉలిక్కి ప డ్డారు.భారీ శబ్దాల ధాటికి కొన్ని ఇళ్లలోని వస్తువులు కదిలిన ట్లు స్థానికు లు తెలిపారు. ముఖ్యంగా రాజేంద్రనగర్‌ పరిధిలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లు అనిపించడంతో భూ కంపం వచ్చిందేమోనని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భ యంతో పిల్లలను వెంటబెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరు గులు తీశారు. అసలు ఏం జరిగిందో తెలియక స్థానికులు పర స్పరం ఆరా తీశారు.

    కారణాలపై పోలీసుల ఆరా.. దర్యాప్తు ముమ్మరం

    సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్‌, లంగర్‌ హౌస్‌ పోలీ సులు ఆయా ప్రాంతాలకు చేరుకుని పరిస్థితులను సమీక్షిం చారు. భారీ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి వెనుక కారణాలేమిటి?అనే అంశాలపై విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరా లను సేకరించేందుకు బాంబ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌లను రంగం లోకి దించుతున్నారు.పేలుళ్లను తల పించే శబ్దాల వెనుక అసలు కారణమేంటన్నది ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది. అయితే, శబ్దా లకు గల కారణంపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

    Hydarabad city Loud Noises Panic

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.