Sunday, November 1, 2026
More
    HomePoliticsPaddy Procurement Delay : నెల రోజులైనా ధాన్యం కొనుగో ళ్లకు మోక్షం లేదా

    Paddy Procurement Delay : నెల రోజులైనా ధాన్యం కొనుగో ళ్లకు మోక్షం లేదా

    📰 Generate e-Paper Clip

    –కొనుగోలు కేంద్రాల్లో అన్నదాత ల పడిగాపులు
    –అకాల వర్షాలతో తడుస్తున్న ధాన్యం
    –బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

    Paddy Procurement Delay : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రై తులు కొనుగోలు కేంద్రాలకు చే రుకుని నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లలో మాత్రం కద లిక కనిపించడం లేదు. కాంటా లు వేయక.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించ క.. అన్నదాతలను నానా ఇబ్బం దులకు గురిచేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వ ర్షిత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీ వ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభు త్వ, అధికారుల నిర్లక్ష్యం కారణం గా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి పడిగాపులు కా యాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు.

    పంట పండించడమే కష్టమైతే.. అమ్ముకోవడం మరో పరీక్ష

    ఈ ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్ర భావం, వర్షాభావ పరిస్థితులు, వి ద్యుత్ సరఫరాలో ఇబ్బందులతో రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్ట పోయారని నాగం వర్షిత్ రెడ్డి పే ర్కొన్నారు. ఎన్నో వ్యయప్రయాస లకోర్చి పండించిన కొద్దిపాటి పం టను విక్రయించేందుకు కొనుగో లు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడ కూడా రోజుల తరబడి నిరీక్షించా ల్సి వస్తోందన్నారు. పంట చేతికొ చ్చిందన్న సంతోషం కూడా రైతు లకు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డా రు.

    అధికారుల పర్యవేక్షణ ఏది?

    ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముం దే జిల్లాలో వరి సాగు విస్తీర్ణం, అంచనా దిగుబడి, అవసరమైన కొనుగోలు కేంద్రాలు, గన్నీ సంచు లు, హమాలీలు, రవాణా వాహ నాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చే యాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యత ను విస్మరించిందని విమర్శించా రు. కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వస్తుందో ముందుగానే అంచనా వేయలేని పరిస్థితి నెల కొందని, అధికారుల మధ్య సమ న్వయ లోపం రైతులకు శాపంగా మారిందని ఆరోపించారు.

    రైతులకు కంటిమీద కునుకు లేదు!

    ఇప్పటికే అకాల వర్షాలు, ముసు రు రైతులను మరింత ఆందోళన కు గురిచేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షా లకు తడిసి ముద్దవుతుండటం తో నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందన్నారు. పంటను కాపా డుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నా అధికారు లు కనీస రక్షణ ఏర్పాట్లు చేయక పోవడం దురదృష్టకరమని పేర్కొ న్నారు.కేంద్ర ప్రభుత్వం కనీస మ ద్దతు ధరతో పాటు ధాన్యం సే కరణకు అ వసరమైన సహకారం అందిస్తు న్నప్పటికీ, రాష్ట్ర ప్రభు త్వం కొను గోలు కేంద్రాల నిర్వహ ణ, కాంటాలు, ధాన్యం తరలింపు లో విఫల మవుతోందని ఆరోపిం చారు.

    మంత్రి ప్రత్యేక చొరవ చూపాలి

    నల్లగొండ జిల్లాకు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి శాపంగా మారార ని నాగం వర్షిత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య లు చేశారు. కొనుగోలు కేంద్రాల ను ప్రారంభించి చేతులు దులు పుకోవడం కాకుండా రైతుల ధా న్యానికి సకాలంలో కాంటాలు వేయించి, కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయించి, మిల్లులకు తర లించే బాధ్యతను ప్రభుత్వం తీ సుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి రైతుల సమస్యలపై ప్రత్యే క దృష్టి సారించాలని కోరారు.

    కలెక్టర్ తక్షణమే స్పందించాలి.. బీజేపీ డిమాండ్లు ఇవే!

    జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల సమ స్యపై జిల్లా కలెక్టర్ వెంటనే జో క్యం చేసుకుని యుద్ధ ప్రాతిపదిక న చర్యలు చేపట్టాలని నాగం వర్షిత్ రెడ్డి డిమాండ్ చేశారు.
    నెల రోజులుగా కొనుగోలు కేంద్రా ల్లో ఎదురుచూస్తున్న రైతుల ధా న్యానికి తక్షణమే కాంటాలు వే యాలని, కొనుగోలు చేసిన ధా న్యాన్ని ఏమాత్రం జాప్యం లేకుం డా మిల్లులకు తరలించాలని,
    అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు టార్పాలిన్లు, ఇత ర రక్షణ ఏర్పాట్లు చేయాలని,
    గన్నీ సంచులు, హమాలీలు, ర వాణా వాహనాలను తగిన సం ఖ్యలో అందుబాటులో ఉంచాల ని, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు నష్టం కలగ కుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి కొనుగోలు కేంద్రంలో అధికా రుల పర్యవేక్షణ పెంచి రైతుల స మస్యలను వెంటనే పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు.

    రాజకీయాల కంటే రైతుల ప్రయో జనాలే ముఖ్యం!

    రైతులను ఆదుకోవాల్సిన సమ యంలో ప్రజాప్రతినిధులు రాజ కీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని నాగం వర్షిత్ రెడ్డి వి మర్శించారు. రైతుల సమస్యల పరిష్కారంపై మంత్రులు, ఎమ్మె ల్యేలు, అధికార పార్టీ నాయకు లు తగిన శ్రద్ధ చూపడం లేదని ఆ రోపించారు. రైతుల కష్టాన్ని రాజ కీయ ప్రచారానికే పరిమితం చే యకుండా వారి పంటకు గిట్టు బాటు ధర, సకాలంలో కొనుగో లు కల్పించాలని హితవు పలి కారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభు త్వం, జిల్లా యంత్రాంగం స్పందిం చి ధాన్యం కొనుగోళ్లు, కాంటాలు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ఇలాగే నిర్ల క్ష్యం చేస్తే భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి పెద్ద ఎత్తు న ప్రజా ఉద్యమాలకు సిద్ధమవు తుందని హెచ్చరించారు.ఈ కా ర్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వా మి, నాయకులు వంగూరి రాఖీ, పాలకూరి రవిగౌడ్, మంగలిపల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.