NalgondaSPSharathChandraPawar : మాదకద్రవ్యాలరహిత సమాజనిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి
--నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
NalgondaSPSharathChandraPawar : ప్రజా దీవెన నల్లగొండ: నషా ముక్త్ భారత్ అభియాన్ లో బాగంగా మా దక ద్రవ్యాల దుర్వినియోగం వ్యతి రేకంగా మిషన్ పరివర్తన్ కార్యక్ర మంలో భాగంగా యువత మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు,వాటి బారిన పడకుండా తీ సుకోవాల్సిన జాగ్రత్తలపై పట్టణ కేం ద్రంలోని యన్.జి కళాశాల విద్యా ర్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ముఖ్యఅతిథిగా హాజ రై మాట్లాడుతూ విద్యార్ధి దశలో మాదక ద్రవ్యాల మాయలో పడి జీవితం వృథా చేసుకోకూడదని, ఒక్కసారి డ్రగ్స్ వాడితే అది మెల్లమెల్లగా వ్యసనంగా మారే ప్రమాదం ఉందన్నారు.
డ్రగ్స్ వాడకం వలన యువత యొ క్క శారీరక, మానసిక ఆరోగ్య విచ్ఛి న్నం కావడంతో పాటు, ఆర్థిక సమ స్యలు,సమాజంలో గౌర వం లేకుండా పోతుందని అన్నారు.సంతోషం కొరకు సేవించడం అలవాటుగా ప డి డ్రగ్స్ బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్ద న్నారు. మత్తుపదా ర్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవు తోందని అన్నారు.కష్టపడి చదివి ఉ న్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలి పారు.
డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పో రాటంలో యువత పాలుపంచు కో వాలని,డ్రగ్స్ వినియోగానికి దూరం గా ఉండడంతో పాటు,తమ దృష్టికి నిషేధిత డ్రగ్స్ సరఫరా మరియు వి నియోగానికి సంబంధిం చిన సమా చారాన్ని తక్షణమే తెలియజేయాలని సూచించారు. యువత ఒక్కసా రి డ్రగ్స్ సేవించి పట్టుబడి కేసు నమోదు అయి తే భవిష్యత్తులో ప్రభు త్వ, ప్రైవేటు ఉద్యోగాలకు మరియు ఏ ఇతర దేశాలకు కూడా వెళ్ళే అవకాశం దొరకక జీవితం అంధకారంలోకి వెళ్తుందని తెలియజేశారు.
ఎవరైనా గంజాయి డ్రగ్స్ సేవిస్తే ND PS చట్టం-1985 తో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన కేసులు నమో దు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను క్రయవిక్రయా లు,సరఫరా చేస్తున్నట్లు సమాచా రం తెలిస్తే, టోల్ ఫ్రీ నెంబర్ 87126 70266 కు సమాచారం తెలపాలని కోరారు.
అనంతరం మాదక ద్రవ్యాల పై జ రుగుతున్న పోరాటంలో క్రియ శిలా భాగస్వామి అవుతానని, డ్రగ్స్ ర హిత జీవనశైలిని అనుస రిస్తూ, నా తో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడా నికి కృషి చేస్తా నని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, మ రియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తె లియజేస్తాను అని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగు తున్న తెలంగాణ ప్రభుత్వ సoక ల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎ స్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సిఐ రా ఘవరావు, 2 టౌన్ ఎస్సై సైదులు, కళాశాల ప్రిన్సిపల్ ఉపేందర్, అ ధ్యాపకులు మరియు విద్యార్దిని, విద్యార్థు లు పాల్గొన్నారు.