Thursday, November 12, 2026
More
    HomeOpinionScheduled Tribe Issues Resolution : షెడ్యూల్ తెగల ప్రజల సమస్యల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్...

    Scheduled Tribe Issues Resolution : షెడ్యూల్ తెగల ప్రజల సమస్యల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు క మిషన్ కోర్టును ఆశ్రయించాలి

    📰 Generate e-Paper Clip

    –ఎస్టీ కమిషన్ కోర్టు ప్రజల హ క్కుల సాధనకు ఒక ఆయుధం

    –దేవరకొండ సమీపంలోని మై నింగ్ పై సమగ్ర సర్వే చేయాలి

    –జాతీయ షెడ్యూల్డ్ తెగల కమి షన్ సభ్యులు జాతోతు హుస్సేన్ నాయక్

    Scheduled Tribe Issues Resolution : ప్రజా దీవెన, దేవ రకొండ: షెడ్యూ ల్డ్ తెగల ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి స మస్యలు ఎదురైనా జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్‌ సీఎస్టీ) ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కమిషన్ కోర్టును ఆశ్ర యించా లని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేన్ నాయక్ అన్నారు. ఎస్టీ కమిషన్ కోర్టు ప్రజల హక్కు ల సాధనకు ఒక ఆయుధమని, తెల్ల కాగితంపై తమ సమ స్య లను రాసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే డైరీ నం బర్ కేటాయించి సమస్యల పరిష్కా రానికి చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు.గురువారం ఆ యన నల్గొండ జిల్లా, దేవరకొండ మండలంలోని వెంకట్ తండా, బొల్లిగుట్ట తండా, కాచారం గ్రా మాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించారు.ఆయా గ్రా మాలు, తండాలలో ప్రజలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలు సుకున్నారు. ముఖ్యంగా మైనింగ్ కా ర్యకలాపాల వల్ల ఎదురవుతు న్న ఇబ్బందులు, రహదారుల స మస్యలు, విద్యుత్, భూముల ప ట్టాలు, తదితర సమస్యలను ప్ర జలు ఆయన దృష్టికి తీసుకువ చ్చారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జాతీయ స్థాయిలో ఎస్టీ ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేస్తు న్నామని, క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల సమస్యల ను స్వయంగా తెలుసుకుంటున్నామని తెలిపారు. మైనింగ్ స మస్యలపై మైనింగ్, పోలీస్, రెవెన్యూ, వై ద్య ఆరోగ్య, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక అందిం చాలని ఆదేశించారు.శ్రీ వెంకటేశ్వర వెంగమాం బ మైనింగ్ కార్య కలాపాలపై ప్రజలు వ్యక్తం చేస్తున్న అభ్యం త రాల నేపథ్యంలో సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో వి చారణ జరపాలని ఆదేశించారు. గ్రామాల్లో పర్యటిం చి ప్రజల అభిప్రాయాలను సేక రించాలని, మైనింగ్ వల్ల కలుగుతున్న ప్ర భావాలను పరిశీలిం చా లని, ఫొటోలు, వీడియోలతో సవిహా నివేదికలు సిద్ధం చేసి ఐదు రోజుల్లో సమర్పించాలని సూచిం చారు. పోలీస్, ఫారెస్ట్, మైనింగ్, వైద్య శాఖల అధికారులు తమ పరిధిలోని అంశాలపై సమగ్ర నివే దికను 15 రోజుల్లో అందించా లని ఆదేశించారు.

    మైనింగ్ లీజుల రెన్యువల్ సమ యంలో ప్రజాభిప్రాయ సేకరణ ని ర్వహించారా? గ్రామస్తులకు స మాచారం ఇచ్చారా? పబ్లిక్ హి యరింగ్‌కు సంబంధించిన లేఖ లు, ప్రజలు పాల్గొన్న వీడి యో లు, ఇతర ఆధారాలను సమర్పిం చాలని మైనింగ్ యజ మానుల ను ప్రశ్నించారు. మైనింగ్‌లో స్థా నిక గ్రామస్తులకు ఉపాధి కల్పిస్తున్నారా? వారికి ఏమైనా ప్రయోజ నాలు అంది స్తున్నారా? గ్రామాని కి అవసరమైన సదుపాయాలు కల్పిస్తు న్నారా? అనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మైనింగ్ కార్యకలాపాలు ని ర్వహించే ప్రాంతాల్లో స్థానిక ప్రజ లకు ఉపాధి కల్పించడంతో పా టు ,అవసరమైన మౌలిక సదు పాయాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని స్పష్టం చేశారు.

    గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న రహ దారి పనులను వెంటనే పూర్తి చే యాలని అధికారులను ఆదేశిం చారు. పనులు చేపట్టి పూ ర్తి చేయని కాంట్రాక్టర్ల ఒప్పందాలను రద్దు చేసి, కొత్త టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సూచిం చారు. గ్రామాల్లో చ ర్చి నిర్మాణాలకు గ్రామ కార్యదర్శి అనుమతులు లేకుండా ప నులు చేపట్టిన అంశంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహ రించిన గ్రామ కార్యదర్శిని బదిలీ చేయాలని హెచ్చరించారు.

    బొల్లిగుట్ట తండాలో మైనింగ్ స మస్యలను పరిష్కరించాలని ప్ర జలు కోరగా వెంటనే సంబంధిత మైనింగ్ అధికారులకు సూ చనలు చేశారు. అర్హులైన వారికి భూ ముల పట్టాలు మంజూ రు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేయగా, త హసీల్దార్‌ను ఆదేశిం చి అవసర మైన వారికి పట్టాలు అందేలా చూడాలని సూచిం చారు. విద్యు త్ వైర్లు ఏర్పాటు చేసి వారం రోజుల్లోగా విద్యు త్ సౌకర్యం పూర్తి స్థాయిలో కల్పించాలని డీఈకి ఆ దేశాలు జారీ చేశారు. అదేవిధం గా భూముల సర్వే నిర్వహించి అర్హత కలిగిన పట్టాదారులు త మ భూముల్లో ఇళ్లు నిర్మించుకు నేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి న సర్వేను సోమవారం వరకు పూర్తి చేయాలని అధికారుల ను ఆదేశించారు.

    కాచారం గ్రామంలో మైనింగ్‌కు సంబంధించిన సమస్యలపై గత 32 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులతో ఆయన మా ట్లాడారు. సమ్మె విరమించాలని కోరుతూ, ప్రభుత్వ పరంగా వారికి రా వాల్సిన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీ సు కుంటామని హామీ ఇచ్చారు. ఎస్టీ ప్రజలు తమ హక్కుల విష యంలో అవగాహ న కలిగి ఉండాలని, ఎలాంటి సమస్య ఎదు రైనా భయపడకుం డా జాతీయ షెడ్యూల్డ్ తెగల క మిషన్‌ను ఆశ్రయించాలని ఆ యన పిలుపునిచ్చారు.

    ఆన్‌లైన్‌ లో ఫి ర్యాదు చేస్తే వెంటనే డైరీ నంబర్ వస్తుందని, దా ని ఆధారం గా సమస్య పరిష్కారానికి కమిష న్ చర్యలు చేపడుతుందని తెలి పారు.గ్రామాల్లో పర్యటించిన సం దర్భం గా ప్రజలు వెల్లడించిన ప్ర తి సమస్యను సంబంధిత శాఖల అధికారులు తీవ్రంగా పరి గణిం చి, నిర్ణీత గడువులో నివేదిక లు సమర్పించడంతో పాటు పరిష్కా రానికి చర్యలు తీసుకో వాలని జటాత్ హుస్సేన్ నా యక్ స్పష్టం చేశారు.రెవెన్యూ అదనపు కలె క్టర్ జె. శ్రీనివాస్ ,ఎన్సీఎస్టీ డైరెక్ట ర్ కళ్యాణ్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టి కమిషన్ సభ్యులు రాంబాబు,డిటిడిఓ కమలాకర్ రెడ్డి ,ఆర్డీవో వన జ రాని, జిల్లా గ్రామీణ అభి వృద్ధి అధికారి శేఖర్ రెడ్డి,డీఎంహెచ్ఓ రాహుల్,ఎంపీడీవో పార్వతి, సర్పంచులు భీముడు ,బుజ్జి, హరిలాల్ ,శ్యామలయ్య అధికా రులు,ప్రజలు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.