Nalgonda Collector Chandrasekhar key appeal : ప్రజా దీవెన, ము నుగోడు: రైతులందరూ సహకరిస్తేనే భూ సమస్యలకు పరిష్కా రం దొరుకు తుందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. గు రువారం ఆయన నల్గొండ జిల్లా ము నుగోడు మండలం సింగా రం గ్రామంలో భూముల రీ సర్వే పై జారీ చేసిన నోటీసులకు వచ్చిన అభ్యంతరాల పరిష్కారానికై నిర్వహించిన గ్రామ సభ కు హాజరయ్యారు. గ్రామంలో మొత్తం 25 5 ఖాతాలు ఉండ గా, 417 ల్యాం డ్ పార్సెల్ మ్యాపులు (ఎల్ పిఎం )లు ఇవ్వ డం జరిగిందని, వాటిపై 59 అభ్యంత రాలు వచ్చినట్లు స్థానిక తహసిల్దారు, చండూర్ ఆర్డీవో శ్రీ దేవి లు జిల్లా కలెక్టర్ కు వివ రించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు రీసర్వే కార్యక్ర మా న్ని పక్కగా నిర్వహించడం జరిగిం దని, గ్రామ కంఠం సరిహద్దులు , ప్రభుత్వ భూములు, రహదా రులు, పట్టా భూములు, ప్ర భుత్వ భూములు అన్నింటిని సర్వే చేసి హద్దులు నిర్ణయించ డం జరిగిందని, అయితే రీసర్వే త ర్వాత 5 9 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు.
అభ్యంతరాలు వ్యక్తం చేసిన రై తులతో జిల్లా కలెక్టర్ స్వయం గా మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనివల్ల స మస్యలు పరిష్కారం కావాలని ,కొత్త సమస్యలు రాకూడదని, రైతులు స మన్వయంతో ప్రభుత్వానికి స హకరిస్తే ఏ గ్రామం లో భూ సమస్యలు ఉండవని తెలిపారు. చట్ట ప్రకారమే భూ ములకు హద్దులు నిర్ణయించడం జరుగుతుందని, ఎవరి భూ ములకు వారికి పట్టా లు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చే శారు. సాధ్యమైనంత వర కు అభ్యంతరాలను తగ్గించుకునే లా రైతులు చూడాలని, రానున్న రోజులలో అభ్యంతరాల స్వీ కరణకు కేవలం 25 రోజుల గడువు మాత్రమే ఉంటుందని, అం దువల్ల రైతులు పక్కనున్న రైతులతో సామరస్య పూర్వకంగా చర్చించుకొని అనవసరమైన గొడవలకు వెళ్లకుండా భూ సమ స్యలు పరిష్కరించుకునేలా ముందుకు రావాలని పిలుపు ని చ్చారు. గ్రామంలో మిగిలిపోయిన సర్వేకు గ్రామస్తులందరూ సహకరించాలని, అందరూ సహకరిస్తే సమస్య త్వరగా పరి ష్కారం అవుతుందన్నారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లా డుతూ పట్టాల ప్రకారమే భూ ములకు హద్దులు నిర్ణయించి ఇవ్వాలని, అన్నదమ్ముల భూ ముల పంచాయతీకి సంబంధించి తేడాలు వచ్చిన కేసులు , భూమి ఉండి పట్టా లేని కేసులు ,నక్ష మ్యాపు సర్వే మ్యాపుల లో తేడాలు అసైన్డ్ భూములు, పట్టా భూముల వివాదాల స మస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.రీ సర్వే చ ట్టం ప్రకారం ప్రతి సమస్య కు పరిష్కారం ఉందని, చట్ట ప్రకా ర మే రైతుల సమస్యలను పరి ష్కరించడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెల్లడిం చారు. శిక్షణ సహాయ కలె క్టర్ ఎ న్. శ్రీకాంత్ రెడ్డి, చండూరు ఆర్డీ వో శ్రీదేవి, స్థానిక సర్పం చ్ ఆండాలు, తహసిల్దార్ ,సర్వేయర్, ఇతర అధికారులు తది తరులు ఉన్నారు.
ఈనెల13న చేయూత పెన్షన్లపంపిణీకి భారీ ఏర్పాట్లు
నల్లగొండ: నల్గొండ నియోజకవర్గ పరిధిలోని చేయూత పెన్షన్ లబ్ధి దారులకు ఈనెల 13న ప్రత్యేక కార్యక్రమం ద్వారా పెన్ష న్లు పంపిణీ చేయనున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏ చూ రి గార్డెన్స్‌లో నిర్వహించనున్న ఈ కార్య క్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కో మటిరెడ్డి వెంకట రెడ్డి ముఖ్య అ తిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని జి ల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ వెల్లడించారు.పెన్షన్ల పంపిణీ కార్యక్ర మాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధి కారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం అధికారులతో కలిసి ఏచూరి గార్డెన్స్‌ను సంద ర్శిం చిన ఆయన ఏర్పాట్ల ను పరిశీలించి పలు సూచనలు చేశారు.
నల్గొండ నియోజకవర్గంలోని వివిధ మండలాలతో పాటు న ల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెన్షన్ లబ్ధిదారులు పెద్ద సం ఖ్యలో హాజరుకానున్న నేపథ్యం లో తాగునీరు, పారి శుద్ధ్యం, హె డెస్క్‌లు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మండలాలు, మున్సిపల్ కార్పొ రేషన్ డివిజన్ల వారీగా లబ్ధిదారు ల జాబితాలను సిద్ధం చేసి, ఎవ రు ఎక్కడ పెన్షన్ తీసుకోవాలో స్పష్టంగా తెలిసేలా ఏర్పాట్లు చే యాల న్నారు.
అర్హులకే పెన్షన్లు.. ముందస్తు జాబితాలు సిద్ధం చేయాలి
కార్యక్రమంలో ఎలాంటి గందరగో ళం తలెత్తకుండా పబ్లిక్ అడ్ర స్ సిస్టం, భోజన వసతి తదితర సౌక ర్యాలు కల్పించాలని అ ధికారు ల కు సూచించారు. పెన్షన్ల పంపిణీ సమాచారాన్ని ముందుగానే లబ్ధిదారులకు చేరవేయాలని, అర్హు లైన వారికే పెన్షన్లు అందించాలని స్పష్టం చేశారు. అనర్హులకు ఎట్టి పరిస్థి తుల్లోనూ పెన్షన్లు పంపిణీ చేయకూడదని, ముందుగానే జా బి తాలను రూపొందించి తనకు సమర్పించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, మంత్రి పీఏ మధు సూదన్ రెడ్డి, మున్సి పల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



