–4,460 ఎకరాలకు సాగునీరు, 1,486 రైతు కుటుంబా లకు ప్రయోజనం
Minister Uttam Kumar Reddy : ప్రజా దీవెన, కోదాడ: రైతుల పొ లాలకు సాగునీరు అందించి వ్య వసాయాన్ని మ రింత సుసంప న్నం చేయడమే లక్ష్యంగా చేపట్టిన రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారు దల శాఖ మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారుల ను, గుత్తేదారులను ఆదేశించా రు. డిసెంబర్ చివరి నాటికి మి గిలిన పనులన్నీ నాణ్యతా ప్ర మాణాలతో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందుబాటులోకి తీ సుకురావాలని స్పష్టం చేశారు.బుధవారం కోదాడ మండ లం రెడ్లకుంట వద్ద పాలేరు వాగుపై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథ కాన్ని మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు. కాలువ నిర్మాణ ప నులు, భూగర్భ మోటార్లు, విద్యుత్ సబ్‌స్టేషన్ పనుల పురోగ తిని సమీక్షించారు.అనంతరం అధి కా రులతో నిర్వహించిన సమా వే శంలో ప్రాజెక్టు పనులపై వివరాలు తెలుసుకున్నారు.
రూ.47.64 కోట్లతో బృహత్తర సాగునీటి ప్రాజెక్టు
రూ.47.64 కోట్ల వ్యయంతో చేప ట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు గ్రా మాల పరిధిలోని 4,460 ఎకరాల కు ఖరీఫ్, రబీ సీజన్లలో సాగునీ రు అందించనున్నట్లు మంత్రి తె లిపారు. ఒక్కొక్కటి 430 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు వీటీ మోటార్ల ద్వా రా పాలేరు వాగు నుంచి నీటిని ఎత్తిపోసి రైతుల పొలాలకు సరఫరా చేయను న్నట్లు వివరించారు.
గ్రామాల వారీగా సాగునీటి ప్రయోజనాలు ఇలా ఉన్నాయి
కాపుగల్లు1,608 ఎకరాలు, నల్లబండగూడెం 1,400 ఎకరా లు,రెడ్లకుంట 576 ఎకరాలు, చిమిరాల 410 ఎకరాలు, కూచి పూడి400 ఎకరాలు, ద్వారకుం ట 66 ఎకరాలు కాగా ఈ ప థకం పూర్తయితే మొత్తం 1,486 కు టుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. వీరిలో బీసీ కుటుంబాలు 720, ఎస్సీ కుటుంబా లు 446, ఓసీ కుటుంబాలు 290, ఎస్టీ కుటుంబాలు 30 ఉన్నా యన్నారు.
పెండింగ్ పనులు వేగవంతం చేయాలి
ప్రస్తుతం ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని, మిగి లిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి ఆ దేశించారు. నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపాలు ఉండకూ డదని, రైతులకు వీలైనంత త్వరగా సా గునీరు అందించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కీలక సూచన
ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. ఇది రైతు పక్షపాత ప్ర భుత్వమని, రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటామని స్ప ష్టం చేశారు. ఎల్‌నినో పరిస్థితుల ను దృష్టిలో పెట్టుకొని రాబోయే యాసంగి సీజన్‌లో తక్కువ నీటి తో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు విజ్ఞ ప్తి చేశారు. వాతావ రణ పరిస్థితు లకు అనుగుణంగా పంటల ఎం పిక చేసుకోవ డం ద్వారా నీటి ఎ ద్దడిని అధిగమించవచ్చని సూచించారు.
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేం దుకు రైతులు, ప్రజల ప్రయో జనాలను దృష్టిలో ఉంచుకుని అ వసరమైన అన్ని చర్యలు తీ సుకుంటామని హామీ ఇచ్చారు. కృష్ణా, గోదావరి జలాల పరిర క్షణ కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య త ఇస్తోందన్నారు. తెలం గాణలో సాగు విస్తీర్ణం, వరి ఉత్పత్తి, ధా న్యం కొనుగోళ్లు గణనీ యంగా పె రిగాయని, ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటలను చాలా వ రకు కాపాడ గలిగామని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటివరకు రూ.90 వేల కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. రై తు భరోసా, పంటల బీమా సహా అన్ని అంశా ల్లో రైతుల సంక్షేమ మే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నా రు.
చిలుకూరు యంగ్ ఇండియా పాఠశాలపై సమీక్ష
ఇదే పర్యటనలో చిలుకూరు మండలంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశా ల భవన నిర్మాణ పనులను కూడా మంత్రి పరిశీలించారు. 2027– 28 విద్యా సంవత్సరం నుంచే త రగతులు ప్రారం భించేలా వచ్చే వి ద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నిర్మా ణ పనులు పూర్తి చే సి పాఠశాలను సిద్ధం చేయాలని అధికా రులకు దిశానిర్దేశం చేశా రు.ఈ పర్యటనలో నల్లగొండ పార్ల మెంట్ సభ్యులు కుందూరు రఘువీర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారా వు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇం జినీర్ నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్, సంబంధిత శా ఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అలసకాని శరభేశ్వర రావు, రెడ్లకుంట సర్పంచ్ పోలం పల్లి కుటుంబ రావు, గ్రామస్థులు పాల్గొన్నారు.


