Wednesday, November 11, 2026
More
    HomeOpinionNalgonda Mayor Burri Chaitanya Srinivas Reddy : నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య...

    Nalgonda Mayor Burri Chaitanya Srinivas Reddy : నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్య, స్కిల్ డెవలప్మెంట్ తో బంగారు భవిష్యత్తు

    📰 Generate e-Paper Clip

    –మహిళలు,యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే న్యాక్ (NAC) లక్ష్యం

    Nalgonda Mayor Burri Chaitanya Srinivas Reddy : ప్రజా దీవెన,నల్లగొండ టౌన్: యు వత నైపుణ్యాలను పెంపొం దించుకొని స్వయం ఉ పాధి పొందాలని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బు ర్రి చైత న్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (N AC) కేంద్రంలో హై దరా బాద్ న్యా క్ డీజీ ఎం.శ్రీనివాస్ రె డ్డితో కలిసి శిక్షణ ప్రయో గశా లలను ప్రారం భించారు. అనంత రం జరిగిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ స్కిల్ డెవల ప్మెంట్ తోనే ఉజ్వల భవిష్య త్తు ఉంటుందని అన్నారు.


    నేటి ప్రపంచంలో విద్యతోపాటు నైపుణ్య అభివృద్ధి కూడా ఎం తో అవసరమని పేర్కొన్నారు.యువత న్యాక్ కేంద్రంలో అందిం చే వివిధ ఉపాధి ఆధారిత కోర్సు లను సద్వినియోగం చేసు కోవా లని సూచించారు.కేవలం ఉద్యో గాల కోసం ఎదురు చూ డకుండా నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

    స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యు వతకు ఉపాధి అవకాశాలు మె రుగు పడటంతో పాటు ఆర్థిక స్వాలంబన సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలు కూడా వి విధ వృత్తి విద్యా కోర్సులను శిక్ష ణ పొందుతూ ఆర్థికంగా ఎదగా లని ఆకాంక్షించారు. నైపు ణ్య శిక్ష ణ పొందిన మహిళలు, యువత తమ ప్రతిభతో మం చి భవిష్య త్తును నిర్మించుకునే అవకాశం ఉందన్నారు. శిక్షణ ప్రయోగశాల ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ ప రిజ్ఞానం పెంపొం దుతుందని, వృ త్తి నైపుణ్యాలు మెరుగుపడతాయని పేర్కొ న్నారు.

    మహిళలు,యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ల క్ష్యం గా న్యాక్ పనిచేస్తుందన్నారురాష్ట్రంలో ఎక్కడలేని వి ధం గా నల్లగొండలో రూ.20 కోట్లతో మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహ కారంతో NAC ని ఏర్పాటు చే యడం జరిగిందన్నారు. మహిళలు, యువత దీనిని సద్విని యోగం చేసుకొని వృత్తి నైపుణ్యాన్ని, ఉపాధి అవకాశాలను పొందాలని సూచించారు.

    హైదరాబాద్ న్యాక్ డైరెక్టర్ జన రల్ ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లా డుతూ ఇప్పటివరకు నాక్ ద్వారా 5 .52 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ అందించడం జరిగింద న్నా రు. నిర్మాణ రంగా నికి సంబం ధిం చి వివిధ ట్రేడ్ కోర్సులతో పాటు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఫిని షింగ్ స్కూల్, MEP మరియు పోస్ట్ గ్రా డ్యుయేట్ డిప్లమా కోర్సు లను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.

    నల్లగొండలో న్యాక్ సొంత కార్ప స్ ఫండ్ నుంచి రూ. 20 కోట్ల వ్య యంతో నాలుగు అంతస్తుల భవ నాన్ని నిర్మించిందని పేర్కొన్నారు. కేంద్రంలో ఆరు ఆధునిక తర గతి గదులు, ఆరు అధునాతన శిక్షణ ప్రయోగశాలను, ఒకేసారి 250 మందికి శిక్ష ణ అందించే సా మర్థ్యం ఉందన్నారు. నల్లగొండ లో ఈ నై పు ణ్య అభివృద్ధి కేంద్రా న్ని ఏర్పాటు చేయడానికి మంత్రి కో మటి రెడ్డి వెంకటరెడ్డి ఎంతో చొరవ చూపారని, ఈ సందర్భంగా ఆ యనకు కృతజ్ఞతలు తెలిపారు.

    జిల్లాలో నిరుద్యోగ యువతకు, మహిళలకు ఉద్యోగ ఉపాధి అ వకాశాలు కల్పించడానికి మంత్రి ఎంతో కృషి చేస్తున్నారని అ న్నా రు. జనవరి 2026 నుంచి ఇప్ప టివరకు నల్గొండ కేంద్రం ద్వారా 1,118 మందికి శిక్షణ అందించ డం జరిగిందన్నారు. ఈ కేంద్రం కేవలం శిక్షణ సంస్థ మాత్రమే కాదని నిరుద్యోగ యువతకు ఉపా ధి ,స్వయం ఉపాధి మరియు ఆర్థిక స్వా లంబన కల్పించే ఒక గొ ప్ప వేదికని తెలిపారు. రాష్ట్రంలో నే ఈ కేంద్రాన్ని ఒక ఆదర్శవంత మైన నైపుణ్య అభివృద్ధి కేంద్రం గా తీర్చిదిద్దేందుకు న్యాక్ కట్టు బడి ఉందన్నారు.జిల్లాలోని ని రుద్యోగ యువత, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కో రారు.

    అనంతరం వివిధ కోర్సులలో శిక్ష ణ పూర్తి చేసుకున్న మహిళ లు, యువతకు మేయర్ బుర్రి చైత న్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి సర్టిఫి కెట్లను పంపిణీ చేశారు. ఈ కా ర్యక్రమంలో NAC డైరెక్ట ర్ ఎం. రాజిరెడ్డి, NAC అసిస్టెంట్ డైరెక్ట ర్ నల్లగొండ చింతమల్ల రమేష్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎం.ఏ.హఫీజ్ ఖాన్, మా జీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి,డిప్యూటీ మేయర్ మ హమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, కా ర్పొరేటర్ మహ మ్మద్ ఇబ్రహీం, వివిధ కంపెనీల ప్రతినిధులు బూ రుగు సుభా ష్, ప్రశాంత్ శెట్టి, డా క్టర్ వైష్ణవ అలీ, ఇమ్మానుయేల్, వినయ్ వంజర, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యా ద వ్, న్యాక్ సిబ్బంది చింతమల ర మేష్, మేడి సురేష్, ఏసమల్ల అ శోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

    Nalgonda Mayor Burri Chaitanya Srinivas Reddy

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.