Tuesday, November 10, 2026
More
    Homeహైదరాబాద్Municipal Commissioner caught red-handed by ACB : బిగ్ బ్రేకింగ్, భైంసాలో ఏసీబీ...

    Municipal Commissioner caught red-handed by ACB : బిగ్ బ్రేకింగ్, భైంసాలో ఏసీబీ వల రూ.50 వేల లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ ఇన్‌ ఛార్జ్ అరెస్ట్, పెండింగ్ బిల్లుల చెక్కు విడుదలకు లంచం డిమాండ్

    📰 Generate e-Paper Clip

     

    Municipal Commissioner caught red-handed by ACB : ప్రజా దీవెన, నిర్మల్: ప్రభుత్వ కార్యాలయాల్లో లం చాల వ్యవహా రానికి మరో అధికారి చిక్కారు. నిర్మ ల్ జిల్లా భైంసా మున్సిపాలి టీలో డిప్యూటీ ఎగ్జి క్యూటివ్ ఇం జినీర్‌తో పాటు ఇన్‌ఛార్జ్ మున్సి పల్ కమిషనర్‌గా విధులు నిర్వ హిస్తున్న జాధవ్ సంతో ష్‌ను ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు రూ.50 వేల లంచం తీసుకుం టుండగా రెడ్‌హ్యాండెడ్‌గా ప ట్టుకున్నారు.

    ఏసీబీ వివరాల ప్రకారం.. భైంసా మున్సిపాలిటీలో ఓ కాంట్రా క్టర్ చేపట్టిన సివిల్ పనులకు సంబం ధిం చి రూ.2,63,128 బిల్లు పెం డింగ్‌లో ఉంది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కు ను విడుదల చేసేం దుకు జాధవ్ సంతోష్ రూ.50 వేల లంచం డిమాం డ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. ఈ క్రమంలో మంగళవారం లంచం సొమ్ము తీసుకుం టుండ గా అధికారిని పట్టుకున్నారు.

    గతంలోనూ రూ.10 వేల వసూలు

    ఇదే పనులకు సంబంధించి గత అక్టోబర్ 26న కూ డా సదరు అధి కారి రూ.10 వేల లంచం తీసు కు ని రూ.6.40 లక్షల విలువైన చెక్కును విడుదల చేసి నట్లు ఏసీ బీ వెల్లడించింది. తాజాగా మిగిలి న రూ.2,63,128 చెల్లింపునకు మరో రూ.50 వేలు డిమాండ్ చే సి స్వీకరించినట్లు పేర్కొంది.లంచంగా తీ సుకున్న రూ.50వేల నగదును అధికారి కారులో ని డా ష్‌బోర్డ్ వద్ద ఏసీబీ అధికారులు స్వాధీనం చే సుకున్నారు. డాష్‌ బోర్డ్ ఉపరితలంపై నిర్వహించి న రసాయన పరీక్షల్లో లంచం తీసు కున్న ఆనవా ళ్లు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.

    అధికార హోదాను దుర్వినియోగం చేసి అక్రమంగా లబ్ధి పొం దేం దుకు విధులను దురుద్దేశంతో నిర్వ హించినట్లు ఏసీబీ పేర్కొంది. నిందితుడిని అరెస్టు చేసి కరీంన గర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యే క న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషి యల్ రి మాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించిం ది.ప్రస్తుతం ఈ కేసులో తదుపరి విచారణ కొనసా గుతోంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచారు.

         లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి

    ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా తెలంగాణ ఏసీ బీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫి ర్యాదు చేయాలని అధి కారులు సూచించారు. ఫిర్యాదుదారు ల వివరా లను గోప్యంగా ఉంచుతా మని స్పష్టం చేశారు. వా ట్సాప్: 9440446106,ఫేస్‌బుక్: Tela ngana A CB, ఎక్స్ @Telang ana ACB లతో పాటు ప్ర భు త్వ కార్యాలయాలు, ప్రధాన బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఏసీ బీ క్యూఆర్ కోడ్ ద్వారా కూ డా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.