–తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి
–నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Brutal murder in Nalgonda district headquarter : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లా కేంద్రంలో దారు ణ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉం టున్న మహిళా హోంగార్డు భర్త చేతిలో హత్యకు గురైంది. కు టుంబ కలహాలు చివరకు హత్యకు దారితీయడంతో పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ క్వార్టర్స్‌లో మంగళవారం ఈ ఘటన జరి గింది. హెడ్‌క్వార్టర్స్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మ హబూబ్ బీ (43) ను ఆమె భర్త సతీష్ హత్య చేసినట్లు పోలీ సులు వెల్లడించారు.
పోలీసుల ప్రాథమిక వివరాల ప్ర కారం పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత భార్యాభర్తల మధ్య వి వా దం ప్రారంభమైంది. మాటా మాటా పెరిగి వాగ్వా దం తీవ్రరూపం దాల్చింది. ఈ క్ర మంలో ఆగ్ర హానికి గురైన సతీష్, భార్య మహబూబ్ బీ తల ను బండకేసి బలంగా కొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయింది.

కుటుంబ భారమంతా ఆమెపైనే
మహబూబ్ బీకి సుమారు 15 ఏ ళ్ల క్రితం గతంలో హోంగా ర్డుగా పనిచేసిన సతీష్‌తో వివాహమైంది. అయితే కొన్నేళ్ల క్రితం సతీష్ విధుల నుంచి తొల గింపునకు గురయ్యాడు. అప్పటి నుంచి కుటుంబ పోషణ బాధ్యతలను మహబూబ్ బీనే నిర్వహిస్తు న్నట్లు తెలిసింది. వీరికి ఇద్దరు కు మార్తెలు, ఒక కు మారుడు ఉన్నారు.
పోలీసుల ఘటనా స్థలo పరిశీలన
సమాచారం అందుకున్న డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ ఆదిరెడ్డి, రూ రల్ ఎస్సై శివప్రసాద్, వన్‌టౌన్ ఎస్సై నాంపల్లి వెంకట్ నారాయ ణ ఘటనా స్థలాన్ని పరి శీలించారు. నిందితుడు సతీష్‌ను అదుపులోకి తీ సుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ శివ రామి రెడ్డి వెల్ల డించారు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగి స్తున్నారు. ముగ్గురు పిల్లలకు తల్లిని దూరం చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Brutal murder in Nalgonda district headquarter
