–హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా మహేష్ భగవత్
–జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా
–షీ టీమ్స్, భరోసా డీజీపీగా సౌమ్య మిశ్రా
–ఆర్టీసీ ఎండీగా అనిల్ కుమార్
Telangana IPS Officers Spark Transfers: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ పోలీస్ శాఖలో ప్రభుత్వం భారీ స్థా యిలో బదిలీలు, పో స్టిం గ్‌లు చేపట్టింది. రాష్ట్ర పోలీస్ యం త్రాంగంలో కీలక మార్పులు చేస్తూ 21 మంది ఐపీఎస్ అధికా రులకు వివిధ హోదాల్లో బాధ్యత లు అప్పగించింది. హైద రా బాద్ పోలీస్ కమిషనర్ నుంచి జైళ్ల శా ఖ, ఏసీబీ, సీఐడీ, గ్రే హౌండ్స్, ఆ ర్టీసీ వరకు పలు కీలక విభాగాల్లో ఉన్నతాధికారు లను మారుస్తూ గురువారం (నవంబర్ 12) సా ధారణ పరిపా లన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమైన నియామకాలు ఇవే
– **మహేష్ భగవత్:** హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా నియామకం.
– **స్వాతి లక్రా:** తెలంగాణ జైళ్లు, దిద్దుబాటు సేవల డీజీగా బాధ్యతలు.
– **డా. సౌమ్య మిశ్రా:** మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా డీజీపీగా నియామకం. డీజీపీ ఆర్గనైజేషన్, లీగల్ బాధ్యతలు అదనంగా అప్పగింత.
– **చారు సిన్హా:** అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా నియామకం. సీఐడీ బాధ్యతలు అదనంగా.
– **డా. అనిల్ కుమార్:** తెలంగాణ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం.
– **వి.సి. సజ్జనార్:** అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల డీజీగా నియామకం. ఎస్పీఎఫ్ డీజీ బాధ్యతలు అదనంగా.
– **వై. నాగిరెడ్డి:** పౌరసరఫరాల శాఖ కార్యదర్శిగా నియామకం. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ బాధ్యతలు కూడా అప్పగింత.
– **విక్రమ్ సింగ్ మాన్:** గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీ (ఆపరేషన్స్)గా నియామకం.
– **ఎం. స్టీఫెన్ రవీంద్ర:** తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్‌గా నియామకం.
– **అకున్ సబర్వాల్:** అదనపు డీజీపీ (శాంతిభద్రతలు)గా నియామకం.
– **ఎస్. చంద్రశేఖర్ రెడ్డి:** ఏసీబీ డైరెక్టర్‌గా నియామకం.
– **కార్తికేయ:** మల్టీ జోన్-1 ఐజీగా నియామకం.
– **కె. రమేష్ నాయుడు:** రైల్వే ఐజీగా నియామకం.
– **డి. జోయల్ డేవిస్:** రోడ్డు భద్రత, ట్రాఫిక్ జాయింట్ డైరెక్టర్‌గా నియామకం.
– **జి. చందన దీప్తి:** జోగులాంబ జోన్-7 డీఐజీ బాధ్యతలు అదనంగా.
– **ఆర్. భాస్కరన్:** ఇంటెలిజెన్స్ డీఐజీ బాధ్యతలు అదనంగా.
– **కె. నారాయణ నాయక్:** బాసర జోన్-2 డీఐజీ బాధ్యతలు అదనంగా.
– **ఎల్.ఎస్. చౌహాన్:** కోఆర్డినేషన్ డీఐజీగా నియామకం.
– **శ్రీ బాల దేవి:** ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్)గా నియామకం.
– **వి. అరవింద బాబు:** హైదరాబాద్ నగరంలో డీసీపీ (SM&IT)గా నియామకం.
ఈ నియామకాలతో రాష్ట్ర పోలీ స్ శాఖలో కీలక విభాగాల పని తీరును మరింత సమర్థవం తం గా తీర్చిదిద్దే దిశగా ప్రభు త్వం అ డుగులు వేసింది. ముఖ్యంగా హై దరాబాద్ నగర పోలీస్ కమిషన రేట్, మహిళా భద్రత, అవినీతి నిరోధక శాఖ, ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల విభాగాల్లో చోటు చేసుకున్న మార్పులు ప్రాధాన్య త సంతరించుకున్నాయి. సం జ య్ జాజు, ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి, గవర్నర్ ఆదేశాల మే ర కు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు త మకు కేటాయించిన కొత్త బా ధ్య తలను స్వీకరించనున్నారు.
Telangana IPS Officers Spark Transfers


