Thursday, November 12, 2026
More
    HomePoliticsGreen SM Aggregator Licence Cancellation : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అల్టిమే టం, గ్రీన్...

    Green SM Aggregator Licence Cancellation : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అల్టిమే టం, గ్రీన్ ఎస్ఎం అగ్రిగేటర్ లైసె న్స్ రద్దుచేయాలి, క్యాబ్‌లకు వెం టనే రేట్ కార్డు ప్రకటించాలి

    📰 Generate e-Paper Clip

    –గ్రీన్ ఎస్ఎం కంపెనీకి అనుమ తుల వెనుక మతలబేంటి
    –ఆరు లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్ల జీవితాలతో చెలగాటమా

    Green SM Aggregator Licence Cancellation : ప్రజా దీవెన, హైదరాబాద్:తెలంగాణలో గ్రీన్ ఎస్ఎం కంపె నీకి ప్రభుత్వం అనుమతులు ఇ వ్వడంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కు మార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే శారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణ యాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సు మారు ఆరు లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఉపాధి ప్రమాదం లో పడే పరిస్థితి ఏర్పడిందని ఆం దోళన వ్యక్తం చేశారు. గ్రీన్ ఎస్ ఎం కంపెనీకి అనుమతులు ఇ వ్వడం వెనుక కమీషన్ల వ్యవహా రం ఉందని ఆరోపించారు. గురు వారం హైదరాబాద్‌లోని తెలంగా ణ భవన్‌లో ఆయన మీడియా తో మాట్లాడారు.మహిళలకు ఉ చిత బస్సు ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకానికి తాము వ్య తిరేకం కాదని, విదేశీ పెట్టుబడు లను కూడా స్వాగతిస్తామని ప్రవీ ణ్ కుమార్ స్పష్టం చేశారు. అ యితే పెట్టుబడుల పేరుతో స్థాని కంగా జీవనోపాధి పొందుతున్న లక్షలాది మంది డ్రైవర్ల జీవితాల ను దెబ్బతీయడం సరైంది కాద న్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో కేటీఆర్ అనేక వి దేశీ పెట్టుబడులను తీసుకొచ్చి నా స్థానిక ఉపాధికి నష్టం కల గ కుండా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు.

    వియత్నాంకు చెందిన గ్రీన్ ఎస్ ఎం కంపెనీ క్యాబ్‌లు ఇప్పటికే హై దరాబాద్ రోడ్లపై తిరుగుతు న్నా యని, ఆ కంపెనీకి అనుమతులు ఇచ్చే ముందు స్థానిక డ్రైవర్ల సం ఘాలతో చర్చించి ఉండాల్సింద ని అన్నారు. ఎలాంటి సమగ్ర అ ధ్యయనం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దురదృష్ట కరమని విమర్శించారు.

    రూ.8కే కిలోమీటర్ ప్రయాణమా

    గ్రీన్ ఎస్ఎం కంపెనీ కిలోమీటర్‌ కు కేవలం రూ.8 మాత్రమే వసూ లు చేస్తామని ప్రకటించడం అనేక అనుమానాలకు తావిస్తోందని ప్ర వీణ్ కుమార్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బేస్ ఫేర్‌కు సంబంధించి నిబంధ నలు ఉండగా, ఇంత తక్కువ ధ రతో సేవలు ఎలా అందిస్తారని ని లదీశారు. కంపెనీకి అగ్రిగేటర్ లై సెన్స్ ఎలా మంజూరు చేశారు? దానికి సంబంధించిన నోట్‌ఫైల్‌ ను ప్రభుత్వం బహిర్గతం చేయా లని డిమాండ్ చేశారు.మొదట తక్కువ ధరలతో వినియోగదా రులను ఆకర్షించి, మార్కెట్‌లో ఆధిపత్యం సాధించిన తర్వాత ధరలు పెంచే విధానం గతంలో టెలికాం రంగంలో జియో ప్రవేశ సమయంలో కనిపించిందని ఉ దాహరణగా పేర్కొన్నారు. అదే తరహాలో గ్రీన్ ఎస్ఎం కూడా వ్య వహరించే ప్రమాదం ఉందని హె చ్చరించారు.

    రుణాలు తీసుకుని వాహనాలు కొన్న డ్రైవర్ల పరిస్థితి ఏంటి

    ఆటో, క్యాబ్ డ్రైవర్లు బ్యాంకు రు ణాలు, బంగారం తాకట్టు పెట్టి వాహనాలు కొనుగోలు చేశారని, ప్రతి నెలా ఈఎంఐలు, వడ్డీలు చె ల్లిస్తూ కుటుంబాలను పోషించు కుంటున్నారని తెలిపారు. ఇప్ప టికే ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల ద్వారా సరైన బుకింగ్స్ రావడం లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఇ లాంటి సమయంలో కొత్త కంపెనీ లకు అనుమతులు ఇచ్చి వారి ఉపాధిని మరింత సంక్షోభంలోకి నెట్టడం తగదన్నారు.

    గతంలో ఆటో డ్రైవర్లకు రూ.5 ల క్షల బీమా సదుపాయం, వాహ నాల కొనుగోలుకు సబ్సిడీలు అందించామని పేర్కొంటూ, కాం గ్రెస్ ప్రభుత్వం రూ.10 లక్షల బీ మా, నెలకు రూ.12 వేల ఆర్థిక స హాయం వంటి హామీలను అమ లు చేయడం లేదని విమర్శించా రు. మహాలక్ష్మి పథకం ప్రభావం తో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని, పలు వురు ఆత్మహత్యలకు పాల్పడ్డా రని ఆరోపించారు.

    క్యాబ్ డ్రైవర్లకు రేట్ కార్డు ఇదే

    ప్రభుత్వం వెంటనే క్యాబ్ డ్రైవర్ల కు ప్రత్యేక రేట్ కార్డు ప్రకటించాల ని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశా రు. ఆయన ప్రతిపాదించిన ధర లు ఇలా ఉన్నాయన్నారు.

    నాన్ ఏసీ క్యాబ్ కిలోమీటర్‌కు రూ.35,ఏసీ క్యాబ్ కిలోమీటర్‌కు రూ.38,ప్రీమియం ఏసీ క్యాబ్ కిలోమీటర్‌కు రూ.42, ఎస్‌యూ వీ 6 సీటర్ నాన్ ఏసీరూ.52,
    ఎస్‌యూవీ 6 సీటర్ ఏసీ రూ. 58,ఎస్‌యూవీ 6 సీటర్ ప్రీమి యం ఏసీ: రూ.62 అలాగే ఆటో రేట్ కార్డులోనూ జీవో 46ను స వరించి, అదనపు కిలోమీటర్‌కు ప్రస్తుతం ఉన్న రూ.14ను రూ. 2 4కు పెంచాలని కోరారు. తమిళ నాడులో అమలు చేస్తున్న ఆటో చార్జీల విధానాన్ని తెలంగాణ ప్ర భుత్వం పరిశీలించాలని సూచిం చారు.

    పార్ట్‌నర్ పేరుతో కార్మిక హక్కు లకు కోతా?

    గ్రీన్ ఎస్ఎం కంపెనీ ‘డ్రైవర్ కా దు.. పార్ట్‌నర్ కండి’ అనే నినా దంతో ముందుకు రావడంపై ఆ యన అభ్యంతరం వ్యక్తం చేశా రు. డ్రైవర్‌గా పనిచేస్తే ఈపీఎఫ్, ఈఎస్ఐ, బీమా వంటి చట్టబద్ధ మైన ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుందని, పార్ట్‌నర్ పేరుతో ఆ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరో పించారు.వారానికి రూ.8 వేలు చెల్లిస్తామని చెబుతూ 500 కిలో మీటర్లు వాహనం నడపాలని ష రతులు విధిస్తున్నారని తెలిపా రు. వాహనంపై చిన్న గీతలు పడి నా జరిమానాలు విధించే నిబం ధనలు ఉన్నాయని, క్యాబ్‌లలో కెమెరాల ఏర్పాటు ప్రయాణికుల వ్య క్తిగత గోప్యతకు భంగం కలి గించే అవకాశముందని ఆందోళ న వ్యక్తం చేశారు.

    ప్రభుత్వానికి బీఆర్ఎస్ డిమాం డ్లు

    ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది.క్యాబ్ డ్రైవర్లకు వెంటనే అధికారిక రేట్ కార్డు ప్రకటించాలి,గ్రీన్ ఎస్ఎం కంపెనీ కార్యకలాపాలను నియంత్రించా లి,కంపెనీకి ఇచ్చిన అగ్రిగేటర్ లై సెన్స్‌ను రద్దు చేయాలి,ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏ ర్పాటు చేయాలి, డ్రైవర్లకు నెల కు రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలి, జీవో 46ను సవ రించి ఆటో డ్రైవర్ల చార్జీలను పెం చాలని డిమాండ్ చేశారు.ఆటో క్యాబ్ జేఏసీ చేస్తున్న పోరాటాని కి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. పేద కు టుంబాల నుంచి వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమస్యపై ముఖ్యమంత్రితో మా ట్లాడి డ్రైవర్లను ఆదుకోవాలని సూచించారు.

    ఆరు లక్షల కుటుంబాల భవిష్య త్తును కాపాడాలి

    ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల ఉపాధిని పెంచేలా ఉండా లి తప్ప, ఉన్న ఉపాధిని దెబ్బతీ సేలా ఉండకూడదని ప్రవీణ్ కు మార్ హితవు పలికారు. రైతు లు, ఆటో డ్రైవర్లు ఇప్పటికే అ నేక సమస్యలు ఎదుర్కొంటున్నా రని, ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లను కూడా సంక్షోభంలోకి నెట్టవద్దని కోరారు. కమీషన్ల కోసం స్థానిక డ్రైవర్ల జీవితాలను బలిచేయవ ద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించా రు.ఈ సమావేశంలో ఆటో క్యాబ్ జేఏసీకి చెందిన ఏఐటీయూసీ, బీఆర్‌టీయూ, సీఐటీయూ, టీ యూసీఐ, టీఎన్‌టీయూసీ, అ మ్మ క్యాబ్, ఏక్తా అసోసియేషన్ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.