Monday, September 28, 2026
More
    HomePoliticsCM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ ఆహ్వా నం, ఈనెల 21న...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ ఆహ్వా నం, ఈనెల 21న పలు కార్యక్రమా లకు హాజరు 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్స వ, శంకుస్థాపన కార్యక్రమాలకు హా జరు కావాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫె సర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కా లేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి కాశీం ఆ దివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎ రేవంత్ రెడ్డిని ఆయన ని వాసంలో కలిసి ఆగస్ట్ 21నఓయూ లో జరిగే కార్యక్రమానికి ముఖ్యఅ తిథిగా రావాలని ఆహ్వానం పలికా రు.

     

    ఓయూలో రూ. 80 కోట్ల వ్యయం తో నిర్మాణమై 1200 మంది విద్యా ర్థులకు వసతి కల్పించే రెండు హాస్ట ల్స్ ను ప్రారంభించి, గిరిజన సంక్షే మం శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి క ల్పించే రెండు కొత్త హాస్టల్స్ నిర్మా ణానికి శంకుస్థాపన కార్యక్రమం సీ ఎం చేతులమీదుగా జరుగనున్నది. ఇప్పటికే ఓయూలో ఉన్న 25 హాస్ట ళ్లలో 7223 మంది విద్యార్థులకు వసతి ఉండగా సీఎం చేతుల మీదు గా ప్రారంభించే హాస్టల్స్ అదనపు వ సతిని సమకూర్చనున్నాయి. ఇదే కార్యక్రమంలో దాదాపు 10 కోట్ల ని ధులతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్

    రూం పనులకు కూడా సీఎం ప్రారం భించనున్నారు. అదే రోజు ఓయూ లో ఉన్న టాగూర్ ఆడిటోరియంలో వెయ్యి మంది ప్రొఫెసర్లను, విద్యా ర్థులను ఉద్దేశించి “ తెలంగాణ వి ద్యా రంగంలో రావాల్సిన మార్పు లు ప్రభుత్వ ప్రణాళిక” అనే విష యం మీద సీఎం ప్రసంగించను న్నారు. ఈ కార్యక్రమంలో తెలంగా ణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అ డ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొంటారు. ఇరవై ఏళ్ల కాలంలో ఓయూలోకి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ప్ర సంగించనున్న తొలి సీఎం రేవంత్ రెడ్డి అని వారు తెలిపారు.

     

    ఈ కా ర్యక్రమంలో “సీఎం రీసెర్చ్ ఫెలో షిప్ “ తో పాటు విదేశీ పర్య టనకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక స హాయాన్ని అందించే పథకాన్ని సీ ఎం చేతుల మీదుగా ప్రారంభించను న్నామని వీసీ తెలిపారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.