CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, పాల మూరు బిడ్డగా బూర్గుల రామకృష్ణ రావు, జైపాల్ రెడ్డి కోవలో కంచుపా డు కామ్రేడ్ సురవరం పాలమూరు జిల్లాకు ఎంతో వన్నె తెచ్చారు
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: సీపీఐ నాయకుడు కామ్రేడ్ సురవరం సు ధాకర్ రెడ్డి మరణం నిరుపేదలకు, బహుజనులకు, సిద్ధాంతప రమైన రాజకీయాలను శ్వాసగా నడుస్తు న్న ప్రతి ఒక్కరికీ తీరని లోటని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పే ర్కొ న్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాల యం మగ్దూం భవన్‌లో కామ్రేడ్ సురవ రం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సుర వరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యు లను పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధై ర్యం చెప్పారు. సీపీఐ నేతలు డి.రా జా, కె.నారాయణ, కూనంనేని సాం బశివరావు, అజీజ్ పాషాతో పాటు అనేకమంది నాయకులను ముఖ్య మంత్రి కలుస్తూ సురవరంసేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే. విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజ కీయాల వరకు తన చివరి శ్వాస వ రకు రాజీపడని నిరాడంబర జీవి తం రాజీపడని సిద్ధాంతంతో ప ని చేశారన్నారు. ఏఐఎస్ఎఫ్ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినా, ఏనాడూ అహంకారం,అహంభావం తన దరిదాపుల్లోకి రానీయలేదు. పాలమూరు బిడ్డగా బూర్గుల రా మకృష్ణ రావు, జైపాల్ రెడ్డి కోవలో కంచుపాడు కామ్రేడ్ సురవరం పా లమూరు జిల్లాకు ఎంతో వన్నె తె చ్చారు.
హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరా టంలో, పత్రికా సంపాదకుడిగా ఎన లేని సేవలు అందించిన సురవరం ప్రతాప రెడ్డి పేరును తెలుగు విశ్వ విద్యాలయానికి పెట్టాలని సుధాకర్ రెడ్డి శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుతో లేఖ పంపించిన ప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయ కుండా వారి సూచన మేరకు తెలు గు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టాము. ఇదే సం దర్భంగా సుధాకర్ రెడ్డిని వ్యక్తి గ తంగా కలిసి మాట్లాడుతానని ఆ రో జు చెప్పాను. అయితే కొంత ఆల స్యమైంది. ఈ రకంగా కలుసుకోవ లసిన పరిస్థితి వస్తుందని ఊహించ లేదు. అధికారంలో ఉన్నా లేకున్నా, ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకున్నా వా రెప్పుడూ సిద్ధాంతాన్ని వదల్లేదు.
కాంగ్రెస్ సమావేశంలోనూ వారి సే వలను స్మరించుకుని ఘనంగా ని వాళులర్పించాం. కాంగ్రెస్ అధ్యక్షు డు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లి కార్జున ఖర్గే సంతాప సందేశాన్ని పంపించారు. ప్రభుత్వ పక్షాన సు రవరం కుటుంబానికి అన్ని రకాలు గా అండగా నిలుస్తాము. విలువల తో కూడిన సిద్ధాంత నిబద్ధత కలిగి న నాయకుల విషయంలో ప్రభు త్వానికి సంపూర్ణంగా సానుభూతి ఉంది. అందుకే కొండా లక్ష్మణ్ బా పూజీ గౌరవార్థం ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీకి పేరును పె ట్టుకున్నాం. మహిళా విశ్వవిద్యాల యానికి చాకలి ఐలమ్మ పేరును పె ట్టాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరును చిర స్థాయిగా గుర్తుంచుకునేలా అనేక విధాలుగా గౌరవించుకున్నాం.
జీవితాంతం సిద్ధాంతపరమైన విలు వలతో కూడిన రాజకీయంతో పని చేసిన సురవరం సుధాకర్ రెడ్డిని శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా మంత్రివర్గంలో చర్చించి సముచిత మైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తన సందేశంలో పే ర్కొన్నారు.