Monday, September 28, 2026
More
    HomePoliticsSP Sharath Chandra Pawar : అడ్డగోలుగా ఆటోలు, అటోఇటో అయితే అంతేసంగతులు 

    SP Sharath Chandra Pawar : అడ్డగోలుగా ఆటోలు, అటోఇటో అయితే అంతేసంగతులు 

    📰 Generate e-Paper Clip

    –నల్లగొండ ప్రధాన కూడళ్లలో అస్త వ్యస్త ట్రాఫిక్ తో అవస్థలు

    –ప్రమాణాలు లేని ఆటోల వల్లే రోడ్ల పై ట్రాఫిక్ సమస్యలని ఫిర్యాదులు

    –సిగ్నల్స్ పేరుతో ఉత్సవవిగ్రహాల్లా కొందరు ట్రాఫిక్ పోలీసుల తీరు

    –ఫిర్యాదులపై స్పందిస్తూ రంగంలో కి దిగిన ఎస్పి శరత్ చంద్రపవార్

    –పద్ధతిలేని ఆటోల తోలకంతో పాదాచారులు, వాహనదారుల ఇక్క ట్లు

    –నల్లగొండ ట్రాఫిక్ సమస్యలను సరిదిద్దాలంటున్న ప్రజల వేడుకోలు

    SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు జటిలమవుతున్నా యి. ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బంది తో పాటు సిగ్నల్స్ అందుబాటులో ఉన్నా నల్లగొండ పట్టణంలో ఇప్ప టికీ ట్రాఫిక్ సమస్యలు ప్రయాణం చేస్తుండడం ప్రజల రోజువారి దిన చర్యలో ప్రతిబంధకాలుగా మారు తున్నాయoటే అతిశయోక్తికాదు. దీ నంతటికీ నల్లగొండ జిల్లా కేంద్రంలో గడిచిన రెండేళ్లలోనే రోడ్లపై చెక్కర్లు కొట్టే ఆటోల సంఖ్య గణనీయంగా పెరిగిందని రవాణాశాఖ గణాంకాల మేరకు తెలుస్తోంది. అయితే నల్ల గొండలో పాదాచారలు కానీ ద్విచక్ర వాహనదారులు గాని కాస్త అటో ఇ టో అయితే ఆటోవాలాలతో అంతే సంగతులు అన్న వాదన బలంగా వినిపిస్తోంది.

    నల్లగొండ జిల్లా కేంద్రంలో కొందరు ఆటోవాలాల ఆటోలచోదకం తీరు హద్దుమీరుతున్నాయన్న ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. అర్హత ఉ న్నా లేకున్నా పుట్టగొడుగుల్లా పు ట్టుకొస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో ఆ టోలు కొనుగోలు చేసి ఏకంగా నల్ల గొండ రోడ్లపైకి రయ్ రయ్ మంటూ వచ్చేసి చక్కర్ల మీద చక్కర్లు కొడు తూనే ఉన్నారు. ఇందులో కొందరు జీవనాధారం కోసం ఆటోలు నడు పుతుంటే మరికొందరు ఫ్యాషన్ గా ఆటోలు నడుపుతున్నారని తెలు స్తోంది.

    చదువును అర్ధాంతరంగా ముగిం చి ఉపాధి పేరుతో కొందరు గ్రామీణ యువకులు జీవనాధారం కోసం ఆ టోలు కొంటున్నప్పటికి వారిలో కొం దరి ఆటోవాలాల వ్యక్తిగత ప్రవర్తన మూలంగా ప్రతిరోజు నడి రోడ్డుపై వాగ్వివాదాలు ఘర్షణ వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. చా లామంది ఆటోవాలాలు ట్రాఫిక్ ని బంధనలను గాలికి వదిలేసి ఇష్టా నుసారంగా నడుపుతున్నారు. వారి ఉపాధి కోసం ఆటోలు నడుపుతు న్నప్పటికీ వారి నడవడికలో క్రమశి క్షణ ఏమాత్రం కనిపించడం లేదన్న ది వాస్తవం. ఆటోవాలాల వల్ల రోడ్ల మీది వాహనదారులే కాకుండా పా దాచారులు సైతం ఇబ్బందులు ప డుతున్నారు.

    అర్హత ఉన్నవారు, అర్హత లేని వా రు, లైసెన్స్ ఉన్నవారు, సరిపడ వ యసు లేని వారు రోడ్లపై ఆటోలను నడపడంతో నల్లగొండ పట్టణంలోని ప్రజలు నానా ఇబ్బందులు పడట మే కాకుండా ప్రమాదాల బారిన ప డుతున్నారన్న సంఘటనలు కోకొ ల్లలు. ఒక్కోసారి ఆటోలు ఒకే వరు సలో రెండు , మూడు మాట్లాడు కుంటూ, పోటీ పడుతూ వెళ్తుం డడంతో వెనుక వచ్చే వాహనా దారులకు దారి ఇవ్వకుండా, సడన్ బ్రేక్ వేస్తూ, ప్యాసింజర్ కనబడగానే ఒకసారిగా ఎడమ కుడివైపునకు మలుపు తిప్పడంతో వాహనదాల కు, పాదాచారులకు సైతం ఇబ్బం దులు నిత్యకృత్యమయ్యాయి.

    ప్రతినిత్యం నలగొండ పట్టణంలోని ఏదో ఒక ప్రాంతంలో ద్విచక్ర వాహ నాలు అదుపుతప్పి కిందపడిన సం ఘటనలు ఉన్నాయి.ఇంత జరుగు తున్న ట్రాఫిక్ పోలీసులు ఉత్సవ విగ్రహాల్లా తయారయ్యారన్న ఆరో పణలు లేకపోలేదు. అడ్డగోలు ఆ టోవాలాలను నియంత్రించకుండా చోద్యం చూస్తున్నారే తప్ప నిబంధ నలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెలు వెత్తుతున్నాయి.

    *పద్మవ్యూహాల్లా ప్రధాన కూడ ళ్ళు…* నల్లగొండ పట్టణంలోని ప లు ప్రధాన కూడళ్ళు పద్మవ్యూహా లను తలపిస్తున్నాయి. ప్రధానంగా బ స్టాండ్ ప్రాంతంలోని కూడలి, అ దేవిధంగా ప్రభుత్వ జనరల్ ఆసు పత్రి సర్కిల్, భాస్కర్ టాకీస్, దేవర కొండ రోడ్డు, సవర్కర్ నగర్ ప్రాంతా లు ఆటోల అడ్డగోలు తోలకంతో ని త్యం నడిరోడ్లపై రద్దీగా ఉంటూ ప్ర జలకు ఇబ్బందులు కలిగిస్తున్నా యన్న ఆరోపణలు కోకొల్లలు. కొ న్ని సందర్భాలలో వాహనదారుల కు, ఆటోవాలాల మధ్య వాగ్వివా దాలు అదే సందర్భంలో ఘర్షణ పరి స్థితులు కూడా చోటుచేసుకుoటు న్నాయని సమాచారం.

    *యదేచ్చగా ట్రాఫిక్ ఉల్లంఘన లు* నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ సి గ్నల్, ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్ప టికీ నియమాల ఉల్లంఘన ఏదేచ్ఛ గా జరుగుతుంది. ఆటోలు రాంగ్ రూట్లో నడుస్తున్న ట్రాఫిక్ పోలీసు లు చూసి చూడనట్లు వదిలేస్తు న్నా రు. కావలసిన దృవపత్రాలు ఉన్నా యా లేవా వారికి అర్హత ఉందా లే దా అనే కోణంలో ఏ ఒక్కరూ పట్టిం చుకోవడం లేదన్న ఆరోపణల నేప థ్యంలో రోడ్లపై తిరిగే ఆటోలు వి చ్చ లవిడిగా పెరిగాయి. వీటిని పర్యవే క్షించడం, నియంత్రించడం విధిగా భావించాల్సిన ట్రాఫిక్ పోలీసులు మిన్నకుండిపోవడంతో ట్రాఫిక్ ఉ ల్లంఘనలు పిచ్చిమీరుతు న్నా య న్న విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. అప్పుడప్పుడు అడపాదడప నాకాబంది నిర్వహించి ట్రాఫిక్ చాల న్లు వేయడం తప్ప మరి ఏ చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలను ట్రాఫిక్ పోలీసులు మూట గట్టు కుంటున్నారు.

    *చివరికి జిల్లా ఎస్పీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి…* ట్రాఫిక్ పో లీసులు, ఆటోల పరిస్థితి, ప్రధాన కూడళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కింది స్థాయి అధికారు లు చూసి చూడనట్లు వ్యవహరించ డంతో అందిన ఫిర్యాదుల మేరకు అధికారి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. సమస్యలు జిల్లా ఎస్పీకి చేరడంతో సిబ్బందితో కలిసి క్షేత్రస్థా యికి వెళ్లిన ఎస్పీ నల్లగొండ పట్ట ణంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యను పరిశీలించి ట్రాఫిక్ సమ స్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జా రీ చేశారు. ఈ సందర్భంగా కింది స్థాయి సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసిన ఎస్పీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకడా చూడాలని ఆదేశించా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.